Whatsapp: ప్రముఖ మెసెంజర్ యాప్ వాట్సప్‌కు కేంద్ర ప్రభుత్వం సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. కొత్తగా తీసుకొచ్చిన ప్రైవసీ పాలసీను వెనక్కి తీసుకోవాలని స్పష్టం చేసింది.
వాట్సప్ ( Whatsapp ) సంస్థ కొత్త ప్రైవసీ పాలసీను తీసుకొచ్చింది. జనవరి 4వ తేదీలోగా కొత్త నిబంధనల్ని అంగీకరించకపోతే వాట్సప్ అక్కౌంట్ డిలీట్ అవుతుందని ప్రకటించింది. దీనిపై పెద్దఎత్తున అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ప్రత్యామ్నాయంగా సిగ్నల్ యాప్ ( Signal app ) డౌన్లోడ్ చేసుకోవడం ప్రారంభించారు. దాంతో వాట్సప్ ఆ నిర్ణయాన్నిపెండింగ్లో ఉంచి గడువు తేదీ పెంచింది.
ఇప్పుడీ విషయంపై కేంద్ర ఐటీ శాఖ ( Union It ministry ) వాట్సప్‌కు గట్టి హెచ్చరికలు జారీ చేసింది. భారతీయ వినియోగదారుల సమాచార గోప్యత, డేటా భద్రతను గౌరవించాలని కొత్తగా తీసుకొచ్చిన ప్రైవసీ పాలసీ ( Whatsapp new privacy policy ) ను వెనక్కి తీసుకోవాలని సూచిస్తూ వాట్సప్ సంస్థ హెడ్‌కు లేఖ రాసింది. నిబంధనలు అంగీకరించకపోతే వాట్సప్ అకౌంట్ తొలగిస్తామనే సందేశాన్ని ప్రభుత్వం తీవ్రంగా తప్పుబట్టింది. ఈ సందర్భంగా 2017లోని జస్టిస్ కేఎస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసును ప్రస్తావించింది. ప్రజల ప్రైవసీ, అంగీకార సూత్రాలకు విలువ ఇవ్వాలనే సుప్రీంకోర్టు తీర్పును వాట్సప్ దృష్టిలో ఉంచుకోవాలని స్పష్టం చేసింది.
వాట్సప్, ఫేస్బుక్ ( Facebook ) లకు ఇండియాలో 40 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. ఇప్పుడు రెండింటి యూజర్ల డేటాను సేకరిస్తే.. దేశంలోని చాలా మంది పౌరుల ప్రైవసీకి భంగం కలిగించినట్లే అవుతుందని ఆ లేఖలో ఐటీ శాఖ అభిప్రాయపడింది. డేటా షేరింగ్ ప్రోటోకాల్స్, వ్యాపార పద్ధతుల గురించి మరిన్ని వివరాలను కోరుతూ కేంద్ర ప్రభుత్వం ( Central Government ) వాట్సప్‌కు ప్రశ్నపత్రాన్ని పంపింది.
Also read: Hike Messaging APP: హైక్ మెసేజింగ్ యాప్ షట్ డౌన్.. యాప్ సేవలు బంద్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook