Cobra Enters Into Man's Shirt: పని చేస్తూ అలిసిపోయినప్పుడో లేక ఖాళీ సమయంలో టైమ్ పాస్ కోసమో చెట్ల కిందకు వెళ్లి విశ్రాంతి తీసుకోవడం చాలామంది ఇష్టపడే వ్యాపకం. ఒక్కోసారి బాగా అలిసిపోయినప్పుడు చెట్ల కింద చల్లటి గాలికి తమకు తెలియకుండానే నిద్ర పట్టేస్తుంది కూడా. అలా ఓపెన్ ఏరియాలో చల్లటి గాలికి చెట్ల కింద ప్రకృతిని ఆస్వాదిస్తూ సేద తీరడానికి, నిద్రపోవడానికి చాలా మంది ఇష్టపడుతుంటారు. కానీ అలా చెట్ల కింద కూర్చోవడం, ఆదమరిచి నిద్రపోవడం కూడా ప్రమాదకరమే అని తాజాగా ఓ ఘటన నిరూపించింది. చెట్టు కింద కూర్చుని నిద్రపోతున్న ఓ వ్యక్తి చొక్కాలోకి ఓ నాగుపాము చొరబడింది.
అదృష్టం కొద్ది అతడికి ఈ భూమ్మీద నూకలు ఇంకా బాకీ ఉన్నాయి కనుక అతడు బతికి బట్టకట్టాడే కానీ లేదంటే నాగు పాము కాటుకు ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. ఈ షాకింగ్ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో ఫుల్ వైరల్ అవుతోంది. ఈ ఘటన ఎక్కడ జరిగింది అనే వివరాలు లేవు కానీ ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది.
చెట్టు కింద చెట్టుకు ఒరిగి కూర్చుని హాయిగా చల్లటి గాలిని ఆస్వాదిస్తూ ఆ వ్యక్తి హాయిగా నిద్రలోకి జారుకున్నాడు. అంతలోనే చెట్టు పై నుంచే వచ్చిందో లేక మైదానంలోంచే వచ్చిందో తెలియదు కానీ ఓ నాగు పాము వచ్చి అతడి చొక్కాలోకి చొరబడింది. ఆ పాము చొక్కాలో వీపు వెనుక నుంచి పొట్టపైకి పాకుతూ వచ్చి చొక్కా గుండీల మధ్యలో ఉన్న గ్యాపులోంచి బయటికి వచ్చేందుకు ప్రయత్నించడం ఈ వీడియోలో చూడవచ్చు.
ఈ వైరల్ వీడియో కూడా చూడండి : Little Boy Playing With Snake: చిన్న పిల్లాడే కానీ పెద్ద పాముకి చుక్కలు చూపించాడు
అతడి దీనావస్తను చూసిన ప్రత్యక్షసాక్షులు అక్కడికి చేరుకుని అతడు కదలకుండా కూర్చోమని చెప్పి నెమ్మదిగా చొక్కా గుండీలు విప్పారు. అతడు కదిలితే ఆ పాము ఎక్కడ అతడిని కరుస్తుందో అనే భయంతో అతడిని కదలకుండా కూర్చోమని చెప్పి వారే అతడికి సహాయం చేశారు. అదే సమయంలో ఆ పాము నెమ్మదిగా వీపు వెనక భాగంలోంచి బయటికి వెళ్లిపోయింది. ఈ వైరల్ వీడియోను ఇంటర్నెట్లో పోస్ట్ చేసిన వ్యక్తి.. " చెట్ల కింద కూర్చున్నప్పుడు జాగ్రత్త వహించండి " అంటూ నెటిజెన్స్‌ని హెచ్చరించారు. ఇలా నిత్యం ఏదో ఒకటి అని కాకుండా కొన్ని పదుల సంఖ్యలో స్నేక్ వీడియోస్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్, యూట్యూబ్ రీల్స్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో వైరల్ అవుతూనే ఉన్నాయి.
ఈ వైరల్ వీడియో కూడా చూడండి : Python Eating Cobra Snake: నాగు పామును తింటున్న పైథాన్.. భయంకరమైన వీడియో