Year Ender 2024 Celebs Marriages: ఈ యేడాది సినిమా వాళ్లు కాకుండా పెళ్లి పీఠలు ఎక్కిన కార్పోరేట్, క్రీడా ప్రముఖులు..

Year Ender 2024 Celebs Marriages:  2024 మరికొన్ని రోజుల్లో ముగయనుంది.ఈ యేడాది నాగ చైతన్య, శోభిత వంటి సినీ సెలబ్రిటీల కాకుండా అనంత అంబానీ వంటి కార్పోరేట్ దిగ్గజంతో  మరోవైపు పీవీ సింధు వంటి  క్రీడా ప్రముఖులు  పెళ్లి పీఠలు ఎక్కారు.

1 /5

అవును మన దగ్గర కేవలం సినీ ప్రముఖులే కాకుండా.. కార్పోరేట్, క్రీడా రంగాల్లో తమదైన ప్రతిభతో రాణించి ప్రముఖులు పెళ్లి పీఠలు ఎక్కారు.

2 /5

పీవీ సింధు- వెంకట దత్త సాయిను  డిసెంబర్‌ 22న పెళ్లి చేసుకుంది. రాజస్థాన్ లోని ఉదయ్ సాగర్ సరస్సులోని రఫెల్స్ హోటల్స్ వేదికగా వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది.    

3 /5

శ్రీకాంత్‌ కిదాంబి- శ్రావ్య వర్మతో కలిసి నవంబర్‌ 9న మూడు ముళ్ల బంధంతో  ఏడడుగులు వేసారు.

4 /5

అనంత్‌ అంబానీ- రాధికా మర్చంట్ జులై 12న ఆకాశమంత పందిరి.. భూ దేవంత అరుగు వేసి నభూతో అన్నట్టుగా వీరి పెళ్లి కలకాలం గుర్తుండేలా చేసారు ముఖేష్ అంబానీ. 

5 /5

వెంకటేశ్‌ అయ్యర్‌- శ్రుతి రఘునాథన్‌ జూన్‌ 2న ఏడడుగుల బంధంతో  వివాహాం చేసుకొని మ్యారేజ్ లైఫ్ లో  అడుగుపెట్టారు.