Yamaha Tenere 700: యమహా Tenere 700 ఆఫ్‌రోడ్ బైక్‌ వచ్చేసింది.. అబ్బబ్బా ఫీచర్స్‌ భలే ఉన్నాయ్.. ధర, ఫీచర్స్‌ ఇవే!

Yamaha Tenere 700 Price In India: భారత్‌లో ఆటో ఎక్స్‌పో 2025 కొనసాగుతూ వస్తోంది. మార్కెట్‌లోకి కొత్త కొత్త కార్లు, మోటర్‌ సైకిల్స్‌ ఒకదాని తర్వాత ఒకటి విడుదలవుతూ వస్తున్నాయి. ఈ ఎక్స్‌పోలో చిన్న స్కూటర్స్‌ను నుంచి పెద్ద పెద్ద స్పోర్ట్స్‌ బైక్‌లు లాంచ్‌ అవుతున్నాయి. ఈ ఆటో ఎక్స్‌పోలో భాగంగా ప్రముఖ మోటర్‌ సైకిల్‌ కంపెనీ యమహా అద్భుతమైన స్పోర్ట్స్‌ బైక్‌ను విడుదల చేసింది. ఇది Tenere 700 పేరుతో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ స్పోర్ట్స్‌ మోటర్‌ సైకిల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
 

1 /5

యమహా Tenere 700 మోటర్ సైకిల్‌ అతి శక్తితంమైన ఇంజన్‌తో అందుబాటులోకి వచ్చింది. ఈ బైక్‌ డబుల్ పెట్రోల్ ట్యాంక్‌తో విడుదల కావడం విశేషం.. అలాగే ఈ స్కూటర్‌ అద్భుతమైన డిజైన్‌ను కలిగి ఉండబోతోంది.  

2 /5

యమహా టెనెరే 700 మోటర్‌ సైకిల్‌ శక్తివంతమైన ఇంజన్, ఆధునిక ఫీచర్లతో లాంచ్‌ అయ్యింది. అంతేకాకుండా  మోస్ట్‌ పవర్‌ఫుల్‌ 689 cc CP2 సమాంతర-ట్విన్ ఇంజన్‌తో విడుదల కానుంది. అలాగే ప్రత్యేకమైన 6 స్పీడ్ గేర్ బాక్స్‌ను కూడా కలిగి ఉంటుంది. ఈ ఇంజన్‌  72 HP పవర్‌తో పాటు 68 NM టార్క్ ఉత్పత్తి చేస్తుంది.  

3 /5

డబుల్ పెట్రోల్‌ ట్యాంక్ వివరాల్లోకి వెళితే.. ఇందులో 23 లీటర్ల రెండు ఇంధన ట్యాంకులు రాబోతున్నాయి. అంతేకాకుండా ప్రత్యేకమైన స్పోర్ట్‌లుక్‌ లుక్‌ కనిపించేందుకు ట్యాంక్‌ స్పెషల్‌గా ఉంటుంది. అంతేకాకుండా ప్రత్యేకమైన సీటింగ్‌ సెటప్‌ను కలిగి ఉంటుంది.     

4 /5

ఈ టెనెరే 700 మోటర్‌ సైకిల్‌ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌తో విడుదల కాబోతోంది. అంతేకాకుండా 62.8 అంగుళాలు బైక్ వీల్ బేస్‌ను కలిగి ఉంటుంది.  అలాగే ప్రత్యేకమైన ABS సిస్టమ్‌ సపోర్ట్‌ ఫీచర్స్‌ కూడా లభిస్తున్నాయి. ఈ మోటర్‌ సైకిల్‌ మార్కెట్‌లోకి లాంచ్‌ అయితే బిఎమ్‌డబ్ల్యూకి బైక్‌కి గట్టి పోటీని ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.  

5 /5

యమహా టెనెరే 700 మోటర్‌ సైకిల్‌ స్పెషల్ ఆఫ్‌రోడ్ రైడింగ్ ఫీచర్స్‌తో లాంచ్‌ కాబోతోంది. అలాగే  ప్రత్యేకమైన KYB ఫ్రంట్ ఫోర్క్‌లను కలిగి ఉండబోతోంది. దీంతో పాటు బ్యాక్‌ వీల్స్‌ 18-అంగుళాలను కలిగి ఉంటుంది. దీని ధర భారత మార్కెట్‌లో రూ.13,00,000 నుంచి ప్రారంభం కాబోతోంది.