Stree 2 Movie: స్త్రీ 2 సినిమాలో 'స్త్రీ' పాత్రలో నటించిన నటి ఎవరో తెలుసా?

Stree 2 Character Pics Viral:  స్త్రీ సినిమా చాలామంది ప్రేక్షకులకు అలరించిన సంగతి తెలిసిందే. ఈ హార్రర్‌ కామెడీ మూవీ అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ నేపథ్యంలో ఇటీవలె స్త్రీ 2 కూడా విడుదలైంది. ఇది బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టిస్తుంది. ఆగస్ట్ 15న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇప్పటికే ఏకంగా 400 కోట్ల క్లబ్‌ చేరిపోయింది. ఈ సినిమాలో శ్రద్ధా కపూర్, రాజ్‌కుమార్ రావు జంటగా నటించారు. అయితే, ప్రస్తుతం అందరి చూపు ఆ 'స్త్రీ' ఎవరు? ఆ పాత్రలో ఎవరు నటించారచే చర్చ అందరిలో మొదలైంది.

1 /5

స్ట్రీ మొదటి భాగంలో నటించిన స్త్రీ పాత్ర నటి ఫ్లోరా సైనీ. ఆతర్వాత స్త్రీ2 లో ఆమెకు బదులుగా మరో నటిని తీసుకున్నారు. ఆమే, భూమి రాజ్‌గోర్. ఈమె గుజరాతీ సినిమాల్లో ఎక్కువగా నటించారు. అహ్మదాబాద్‌కు చెందిన భూమి సోషల్‌ మీడియాలో కూడా యాక్టీవ్‌గా ఉంటారు. భూమి స్త్రీ 2 కంటే ముందు కార్తీక్ ఆర్యన్, కియారా అద్వానీ నటించిన 'సత్యప్రేమ్ కి కథా' చిత్రంలో నటించారు.  

2 /5

ఈ సినిమాలో  ఆమె కియారా సోదరిగా నటించి అందరినీ మెప్పించారు. ప్రస్తుతం ఈమె ముంబైలో ఉంటారు. బాలీవుడ్‌లో కూడా ఈమెకు చాలామంది ప్రముఖులతో కలిసి పనిచేసింది. ఎందుకంటే ఆమె మేకప్ ఆర్టిస్ట్ గా కూడా పనిచేశారు.ముఖ్యంగా భూమి కేవలం నటి మాత్రమే కాదు ఈమె మంచి కథక్ నృత్యకారిణి కూడా.   

3 /5

ఒక ఇంటర్వ్యూలో భూమి ఈ పాత్రకు ఎలా తనని సెలక్ట్ చేశారు అనే విషయం చెప్పింది. ముఖ్యంగా ఈమె ఓ చిన్న పాత్ర కోసం ఆడిషన్‌ వెళ్లారట అక్కడ దర్శకుడు అమర్‌ కౌశిక్‌ బిగ్గరగా అరవమని అడిగాడట అలా గట్టిగా కేకలు వేసి స్త్రీ2 డైరెక్టర్‌ను మెప్పించడంతో ఆ పాత్ర తనకు దక్కిందని చెప్పారు.   

4 /5

అయితే, స్త్రీ సినిమాలో చండేరీ గ్రామ ప్రజలు స్త్రీ పీడవిరగడయిందని అనుకుంటారు. అయితే, ఆ దెయ్యం జుట్టు హిరోయిన్‌ జుట్టుకు పెట్టుకున్నట్లు చివరిలో కనిపిస్తుంది.  ఆ తర్వాత స్త్రీ 2 సినిమా విషయానికి వస్తే సర్‌ ఖటా అనే ఓ దెయ్యం ఆ ఉళ్లో ఉన్న స్త్రీలను మాయం చేస్తుంది. స్త్రీ మొదటి భాగంలో మగవారిని మాయం చేసేది.  

5 /5

ఈ మూవీ ప్రేక్షకులకు ఏ మాత్రం బోర్‌ కొట్టకుండా ఆద్యాంతం ఆకట్టుకుంటోంది. దీంతో స్త్రీ 2 కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. ముఖ్యంగా ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఓ ఐటెం సాంగ్‌లో ఉన్నారు.