Laila Movie Pre Release Business: విశ్వక్ సేన్ టాలీవుడ్ యంగ్ హీరోల్లో ముఖ్యంగా మాస్ లో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాదు సినిమాకు సినిమాకు వైవిధ్యమైన నటన చూపిస్తున్నాడు. తాజాగా ఈయన ఆడ వేషంలో ‘లైలా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత ? హిట్ అందుకోవడానికి విశ్వక్ సేన్ ముందున్న టార్గెట్ ఎంతనే విషయానికొస్తే..
Laila Movie Pre Release Business: విశ్వక్ సేన్ సినిమా సినిమాకు వైవిధ్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. అంతేకాదు విశ్వక్ తన సినిమాలను కాంట్రవర్సీలను క్రియేట్ చేసి అందరిచూపు తన సినిమా వైపు పడేలా చేసుకోవడంలో పెద్ద మార్కెటింగ్ స్ట్రాటజీ ప్లే చేస్తాడనే టాక్ వుంది. ఆ సంగతి పక్కన పెడితే.. ‘లైలా’ మూవీ కూడా విడుదలకు ముందే పలు వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచింది.
ముఖ్యంగా నందమూరి కాంపౌండ్, మెగా కాంపౌండ్ అనే చర్చకు తన సినిమాతో తెర లేపాడు. అంతేకాదు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పృథ్వీరాజ్ చేసిన కొన్ని డైలాగులు ఏపీలో ప్రతిపక్ష వైసీపీ శ్రేణులకు ఆగ్రహం తెప్పించాయి. దీంతో బాయ్ కాట్ చేయాలని వాళ్లు పిలుపునిచ్చారు. దీనిపై విశ్వక్ సేన్ క్షమాపణలు చెప్పాడు.
మొత్తంగా రిలీజ్ కు ముందు టీజర్, ట్రైలర్ కంటే వివాదాలతోనే సినిమాపై అటెన్షన్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు విశ్వక్ సేన్. మరోవైపు టీడీపీ, జనసేన వాళ్లు ఈ సినిమాకు పాజిటివ్ ప్రమోషన్స్ కలిసొచ్చే అంశాలని చెప్పొచ్చు. సెన్సార్ వాళ్లు ఈ సినిమాకు A సర్టిఫికేట్ ఇచ్చారు.
ముఖ్యంగా ఇందులో డబుల్ మీనింగ్ డైలాగులతో పాటు కాస్త బోల్డ్ కంటెంట్ కొన్ని సన్నివేశాల కారణంగా ఈ సినిమాకు ఈ సర్టిఫికేట్ జారీ చేశారు. ఇక ఈ సినిమా 2 గంటల 16 నిమిషాలు ఉండటం ఈ సినిమాకు కలిసొచ్చే అంశాలు. లాస్ట్ ఇయర్ ‘గామి’, ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాలతో హిట్స్ అందుకున్న విశ్వక్ సేన్.. చివరగా ‘మెకానిక్ రాకి’తో ఫ్లాప్ ను మూట గట్టుకున్నాడు.
మరోవైపు లైలా సినిమా ట్రైలర్ తో అంచనాలు పెరిగాయి. ఈ సినిమా ఏరియా వైజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే.. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ. 6 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసాయి. ఓవర్సీస్, రెస్ట్ ఆఫ్ భారత్ కలిపి రూ. 6 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. మొత్తంగా రూ. 8.2 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ వరల్డ్ వైడ్ గా అందుకుంది. మొత్తంగా ఈ సినిమా హిట్ అవ్వాలంటే రూ. 9 కోట్ల షేర్ అందుకోవాల్సిన అవసరం ఉంది.
రీసెంట్ టైమ్ లో విశ్వక్ సేన్ సినిమాలు ఇదే 8 కోట్ల లోపు బిజినెస్ ను సొంతం చేసుకొని డీసెంట్ హిట్స్ గా నిలిచాయి. మరి ఈ సినిమా కూడా హిట్ గా నిలుస్తుందా లేదా అనేది చూడాలి.