Simbu: శింబు, నయనతార దాదాపు 9 ఏళ్ల తర్వాత మళ్లీ కలవబోతున్నారు. ఎన్నో రోజులు ప్రేమించుకున్న ఈ జంట విడిపోయిన సంగతి తెలిసిందే. ఇకనైనా తార దర్శకుడు విగ్నేష్ శివని పెళ్లి కూడా చేసుకుంది. ఈ క్రమంలో ఇప్పుడు ఒక సినిమా కోసం ఈ ఇద్దరు కలవనున్నారు. ఈ వార్త నెట్టింట్లో వైరల్ అవుతోంది.
నటుడు శింబు, నటి నయనతార ఒకప్పుడు ప్రేమికులుగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. వాళ్లు వల్లభన్ సినిమాలో కలిసి నటించినప్పుడు ప్రేమలో పడ్డారు. సినిమా కార్యక్రమాల్లో కలిసి కనిపించడంతో పెళ్లి చేసుకుంటారని అభిమానులు భావించారు. అయితే, వారి వ్యక్తిగత ఫోటోలు లీక్ కావడంతో పెద్ద వివాదం ఏర్పడింది. ఈ ఘటన తర్వాత శింబు - నయనతార విడిపోవడంతో, ఇకపై కలిసి పనిచేయరని అనుకున్నారు.
అయితే, అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ 2016లో వీరిద్దరూ ఇదు నమ్మ ఆలు చిత్రంలో కలిసి నటించారు. బ్రేకప్ తర్వాత మళ్లీ స్నేహితులయ్యామని వీరు వెల్లడించారు. ఈ సినిమా తర్వాత, నయనతార దర్శకుడు విఘ్నేష్ శివన్‌ను ప్రేమించి వివాహం చేసుకుంది.
ఆ తర్వాత శింబు, నయనతార ఏ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లోనూ కలిసి కనిపించలేదు. దాదాపు 9 ఏళ్ల అనంతరం మళ్లీ ఒకే వేదికపై వీరు కలిసి కనిపించబోతున్నారు. ఫిబ్రవరి 21న విడుదల కానున్న డ్రాగన్ సినిమా ప్రమోషన్ ఈవెంట్‌కు శింబు, నయనతార ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
డ్రాగన్ చిత్రానికి అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించగా, ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించాడు. ఏజీఎస్ ఎంటర్టైన్‌మెంట్ ఈ చిత్రాన్ని నిర్మించింది. కాయాదు లోహర్, అనుపమా పరమేశ్వరన్ హీరోకి జోడీగా నటించారు. ఈ సినిమా ₹37 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందించబడింది. లియోన్ జేమ్స్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు. ఈ చిత్రంలో శింబు ప్రత్యేకంగా ఓ లవ్ ఫెయిల్యూర్ సాంగ్ పాడడం విశేషం.
శింబు, నయనతార ఒకే వేదికపై కనిపించబోతున్నారని..తెలియడంతో అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వారిద్దరి కలయిక మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.