Rashmika on Valentines Day: రష్మిక మందన్నకు వాలెంటైన్స్ డే రోజు.. ప్రముఖ వ్యక్తి పూలను అందజేయగా, ఆమె అందుకు ఇచ్చిన రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనితో విజయ్ దేవరకొండ, రష్మిక మధ్య ఉన్న బంధం గురించి మళ్లీ చర్చలు మొదలయ్యాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..
టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా రాణిస్తున్న రష్మిక మందన్నా, విజయ్ దేవరకొండల మధ్య ఉన్న ప్రత్యేక అనుబంధం గురించి తరచుగా వార్తల్లో ఉంటుంది. అయితే, ఇటీవల రష్మిక తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక గులాబీ పువ్వుల బొకేని షేర్ చేయడంతో ఈ వార్తలు మరింత ఊపందుకున్నాయి.
రష్మిక తన పోస్ట్ లో “You always know how to put a smile on my face, పాపలు” అంటూ కామెంట్ చేయడం విశేషం. ఈ పదం ఆమెకు అత్యంత ప్రత్యేకమైనదని అభిమానులు భావిస్తున్నారు. అయితే, ఈ పువ్వులు ఎవరు పంపించారనే విషయంలో ఆమె ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ వాలెంటైన్స్ డే రోజు వచ్చింది కాబట్టి ఇది తప్పకుండా బాయ్ ఫ్రెండ్ ఇచ్చి ఉంటారని.. ఇక ఆ బాయ్ ఫ్రెండ్ ఎవరో కాదు విజయ్ దేవరకొండ అని అందరూ కామెంట్స్ పెడుతున్నారు.
విజయ్-రష్మిక మధ్య ఉన్న కెమిస్ట్రీ చాలా సందర్భాల్లో కనిపించింది. ఒకే సముద్ర తీరంలో తీసిన ఫోటోలు, ఇంటర్వ్యూలో ఒకరిపై ఒకరు కామెంట్లు చేయడం, ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ వంటి ఎన్నో విషయాలు వీరిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమే..కాదనే ఊహాగానాలకు కారణమయ్యాయి.
ఇక దీంతో ప్రేమికుల రోజు..రష్మిక స్టోరీని చూసిన వెంటనే అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. “పాపలు అంటే విజయ్ నేనా?”, “ఇదే కన్ఫర్మేషన్ అవుతుందా?” అంటూ చర్చలు మొదలయ్యాయి. అయితే, ఇంతవరకు ఇద్దరూ అధికారికంగా తమ రిలేషన్ గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ రూమర్స్ నిజమా? లేక కేవలం అభిమానుల ఊహాగానాలా? అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అయినా, వీరి మధ్య ఉన్న అనుబంధం అభిమానులను ఎప్పుడూ ఆసక్తిగా ఉంచుతోంది.
రష్మిక మందన్నా బాలీవుడ్ లో ‘ఛావా’ సినిమాతో ఆకట్టుకుంటోంది. ఇక ‘సికందర్’ సినిమా ద్వారా సల్మాన్ ఖాన్ సరసన నటించనుంది. మరోవైపు, విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న ‘కింగ్డమ్’ సినిమాకు సిద్ధమవుతున్నారు.