Lucky zodiac signs for marriage: పెళ్లి అనేది మనిషి జీవితంలో ఎంత ముఖ్యమైనదో అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా మన హిందూ సాంప్రదాయంలో.. కళ్యాణం టైం వస్తే తప్పకుండా పెళ్లి అవుతుంది అనేది కూడా ఎంతోమంది నమ్మే విషయమే.
ముఖ్యంగా శుక్రడు బలంగా ఉందే టైంలో.. పెళ్లి చేయడం మంచిదంటారు. మరి ఈ వాలెంటైన్స్ డే సందర్భంగా.. ఈ సంవత్సరం ఏ రాశుల వారికి శుక్ర బలం బాగుందో చూద్దాం.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్ర గ్రహం ప్రేమ, పెళ్లి సంబంధాలకు కారణంగా చెప్పబడుతుంది. జాతకాలలో శుక్రుడు బలంగా ఉంటే.. ఆ టైంలో వారికి పెళ్లి చేయడం ఎంతో మంచిది. శుక్ర బలం బాగా ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్న వారి.. ప్రేమ జీవితంలో ఆనందం, శాంతి ఉంటాయి అనేది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎంతో మంది నమ్మకం. శని, గురు, శుక్ర అనుగ్రహంతో జీవితంలో పెళ్లి అవకాశాలు మెరుగుపరుతాయి. ఈ సంవత్సరం గ్రహస్థితి ప్రేమ, పెళ్లి విషయంలో కొన్ని రాశులకు అనుకూలంగా ఉంది. ఈ క్రమంలో వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సంవత్సరంలో ఏ రాశుల వారికి.. పెళ్లి టైం వచ్చిందో చూద్దాం.
వృషభ రాశివారికి ఈ ఏడాది పెళ్లి సంబంధాలు అనుకూలంగా ఉంటాయి. ప్రేమ వ్యవహారాలు కుటుంబ అంగీకారంతో ముందుకు సాగుతాయి.
కర్కాటక రాశివారికి ప్రేమ, పెళ్లి విషయంలో గొప్ప మార్పులు చోటు చేసుకోనున్నాయి. నిశ్చితార్థం, వివాహ యోగం బలంగా ఉంది. తప్పకుండా వారు ప్రేమించిన వారిని పెళ్లి చేసుకుంటారు.
తులా రాశివారు ఈ ఏడాది నిజమైన ప్రేమను కనుగొంటారు. ఈ రాశి వారికి కొత్త సంబంధాలు పెళ్లి వరకు చేరే అవకాశం ఉంది.
ఈ మూడు రాశులకే కాకుండా..మకర రాశివారు ఈ ఏడాది అనుకున్న ప్రేమను పెళ్లిగా మార్చుకునే అవకాశం ఉంది. శుభ సమయాన్ని ఉపయోగించుకోవాలి.
పైన చెప్పిన వివరాలు జ్యోతిష్య శాస్త్రం ఆధారంగా ఇవ్వబడినవి. జి వీటికి ఎటువంటి బాధ్యత వహించదు.