Travel Allowance: కరోనా సంక్షోభ సమయంలో మొత్తం ప్రపంచం ఇళ్లలోనే బందీ అయిపోయినప్పుడు ట్రావెల్ రీయింబర్స్‌మెంట్ ఎలా సాధ్యం..అందుకే ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరిస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు దీనికోసం ఏ రసీదు లేదా వోచర్ ఇవ్వాల్సిన అవసరం లేదని శుభవార్త అందించింది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త ఏడాదికి ముందే గుడ్‌న్యూస్ అందుతోంది. రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్ విషయంలో నిబంధనల్ని సులభం చేసింది ఆర్ధిక శాఖ
కరోనా సంక్షోభం కారమంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లభించే కాస్ట్ ఆఫ్ లివింగ్ అలవెన్స్ 17 శాతం చొప్పున ఉండేది. అంతకుముందు అది 21 శాతంగా ఉండేది. 2021 జూన్ వరకూ ఇదే కొనసాగుతుంది. ఆ తరువాత తిరిగి 21 శాతం చెల్లించవచ్చు.దీంతో ఉద్యోగులకు ఎక్కువ ప్రయోజనం కలుగుతు్ంది. పెన్షనర్లకు ఎక్కువ పెన్షన్ వస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి యేటా జూలైలో కాస్ట్ ఆప్ లివింగ్ అలవెన్స్ పెంచుతుంటారు. కానీ ఈ ఏడాది కరోనా మహమ్మారి కారణంగా ఏప్రిల్‌లో ప్రభుత్వం పెంచలేదు.
రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్ కోసం వోచర్లు చూపించేందుకు సమస్య ఎదురవుతుందనే పే లెవెల్ 9 నుంచి 11 వరకు ఉండే ఉద్యోగుల ఫిర్యాదు మేరకు ఆర్ధిక శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల ఈ సమస్యను దూరం చేసేందుకు ఏడవ వేతన సంఘం కింద లెవెల్ 9 నుంచి 11 వరకు ఉద్యోగులకు కూడా వోచర్ సమర్పించాల్సిన అవసరాన్ని తొలగించింది.
ఇంతకుముందు టీఏ నిబంధనల ప్రకారం నగర పరిధిలో ప్రయాణ ఖర్చులు పే లెవెల్ 8 లేదా అంతకంటే దిగువవారికి రీయింబర్స్‌మెంట్ కోసం చూపించే వోచర్ నుంచి మినహాయింపు లభించింది. పే లెవెల్ 8 కంటే ఎగువన ఉన్నవారు మాత్రం వోచర్ చూపించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు పే లెవెల్ 9 కంటే ఎగువన ఉన్నవారు కూడా వోచర్ లేదా రసీదు చూపించాల్సిన అవసరం లేదు.
ట్రావెల్ అలవెన్స్ అంటే టీఏ కోసం ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే క్లెయిమ్ చేసుకోడానికి యాత్రకు సంబంధించిన సమాచారం, ప్రయాణ కాలం, వాహనం నెంబర్ వంటి వివరాలు అవసరం లేదు. 7వ వేతన సంఘంలోని పే లెవెల్ 9 నుంచి 11 పరిధిలో వచ్చే ఉద్యోగులకు ఇది వర్తిస్తుంది. రోజువారీ లభించే టీఏ కోసం లోకల్ ప్రయాణ ఖర్చుల రీయింబర్స్‌మెంట్ కోసం రసీదు లేదా వోచర్ చూపించాల్సిన అవసరం లేదు.