Shark Attack: ఒళ్లు గగుర్పొడిచే ఘటన.. తిమింగలంతో సెల్ఫీ కోసం ప్రయత్నించిన మహిళ.. ఆ తర్వాత ఏంజరిగిందంటే..?

Shark attack on Canadian woman: మహిళ టర్క్స్ , కైకోస్ బీచ్ దగ్గరకు సరదాగా వెళ్లింది. అక్కడ ఒక తిమింగలంను చూసింది. ఇంతలో ఆమె దానిముందు సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించింది.
 

1 /5

సాధారణంగా చాలా మంది సముద్రం దగ్గరకు సరదాగా గడిపేందుకు వెళ్తుంటారు. అయితే.. స్విమ్ వచ్చిన వాళ్లు సముంద్రంలోపలికి వెళ్తుంటారు. కానీ మరికొందరు మాత్రం ఒడ్డుకు దగ్గరలోనే ఉంటారు. సముద్రంలోపల.. తిమింగలాలు, పెద్ద పెద్ద చేపలు ఉంటాయి. ఆక్టోపస్ లు  ఉంటాయి.  

2 /5

 ఇవి కొన్నిసార్లు ఒడ్డుకు వచ్చి, అక్కడున్న జనాలు మీద దాడులు చేస్తుంటాయి. సముద్రంలో అలల బలమైన తాకిడికి చాలామంది సముద్రంలోపలికి లాక్కెళ్లిపోతుంటారు. ఈ క్రమంలో ఒక మహిళ చేసిన పని ప్రస్తుతం వార్తలో నిలిచింది. ఇటీవల సెల్ఫీల పిచ్చిలో జనాలు ఎంతకైన తెగిస్తున్నారు.

3 /5

తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి మరీ సెల్పీలు దిగుతున్నారు. ఈనేపథ్యంలో ప్రస్తుతం ఒక కెనడియన్ మహిళ టర్క్స్,  కైకోస్ బీచ్ కు వెళ్లింది.అక్కడ మహిళ సముద్రంలో ఒక భారీ తిమింగలంను చూసింది.  మరీ ఆమెకు ఏమన్పించిందో కానీ.. దానిముందుకు సెల్పీలు దిగేందుకు ప్రయత్నించింది. ఇంతలో అది ఆమెపై దాడిచేసి.. రెండు చేతుల్ని కొరికింది.   

4 /5

కొంచెంలో ఆమె ప్రాణాపాయంనుంచి బైటపడింది. వెంటనే ఆమెను అక్కడున్న వాళ్లు కాపాడి ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమెకు రెండు చేతుల నుంచి రక్తం ధారగా కారింది. ఆమె అతి కష్టం మీద ఈ ప్రమాదం నుంచి బైటపడింది.ఆమెను దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు.

5 /5

బాధిత  మహిళ చేతులు మణికట్టు వద్ద తెగిపోయాయి. మరొకటి ఆమె ముంజేయి వరకు మధ్యలో తెగిపోయింది. ఆమెకు 55 ఏళ్ల వయసు ఉంటుందని సమాచారం. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో సీరియస్ కండీషన్ లొ చికిత్స తీసుకుంటుంది. ఈ క్రమంలో ప్రస్తుతం ఈ ఘటన మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది.