Former Prime Minister Manmohan Singh: భారత మాజీ ప్రధాని, కాంగ్రెస్ కురవృద్దుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ 26-12-2024 కన్నుమూశారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు మన్మోహన్ సింగ్. మన్మోహన్ సింగ్ భారతదేశానికి పద్నాలుగవ ప్రధానమంత్రిగా పనిచేశారు. అయితే మన్మోహన్ సింగ్ కు సంబంధించిన కొన్ని రేర్ ఫొటోస్ ను చూసేద్దాం..
భారతదేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సెప్టెంబర్ 1932, 26న పంజాబ్‌లోని గాహ్ గ్రామంలో జన్మించారు. ఆయన ఆర్థిక శాస్త్రంలో మాస్టర్స్‌ను పూర్తి చేశారు.
ప్రఖ్యాత ఆర్థికవేత్త, జవహర్‌లాల్ నెహ్రూ మరణం తర్వాత అధికారంలోకి వచ్చిన మొదటి సిక్కు మన్మోహన్ సింగ్. ఆయన 1966 నుంచి 1969 వరకు ఐక్యరాజ్యసమితిలో పనిచేశారు.
అటల్ బిహారీ వాజ్ పేయి ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ 1998 నుంచి 2004లో రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు.
సుమారు 33 ఏళ్లు రాజ్యసభ ఎంపీగా పనిచేశారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్. 1987లో ఆయనకు పద్శవిభూషణ్ పొందారు.
2005లో మన్మోహన సింగ్ ఉపాధి హామీ పథకాన్ని తీసుకువచ్చారు. కేంద్ర ఆర్థిక మంత్రి, ప్రధానమంత్రిగా పని చేశారు.
మాజీ ప్రధానీ మన్మోహన సింగ్ ప్రతిరోజు 18 గంటల పాటు అవిశ్రాంతంగా పనిచేసేవారు. 2017లో ఇందిరాగాంధీ శాంతి బహుమతిని అందుకున్నారు.
ముఖ్యంగా మన్మోహన్ సింగ్ ఫోర్బ్స్ అత్యంత శక్తిమంతుల జాబితాలో చోటు దక్కించుకున్నారు.