Tollywood Actress: 7 ఏళ్లకే మూడు పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్..!

Tollywood Actress Fourth Marriage: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మంచి పేరు దక్కించుకున్న కోలీవుడ్ భామ వనిత విజయ్ కుమార్ ఏడేళ్లలోనే మూడు పెళ్లిళ్లు చేసుకుని ఇప్పుడు నాలుగో పెళ్లికి సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అసలు ఇన్ని పెళ్లిళ్లు ఈ హీరోయిన్ ఎందుకు చేసుకుంది..? ఇంతకు ఇప్పుడు చేసుకునే అబ్బాయి ఎవరు.. అనే పూర్తి వివరాలు లోకి వెళితే..
 

1 /5

ఈ మధ్యకాలంలో ఏ ఇండస్ట్రీలో చూసినా కూడా.. విడాకులు తీసుకునే వారి సంఖ్య ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నది.. ముఖ్యంగా సినీ సెలెబ్రెటీలు అయితే ఈరోజు విడాకులు రేపు మరో పెళ్లి అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉన్నారు.. అయితే తాజాగా ఇప్పుడు ఒక హీరోయిన్ ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకొని ఒక సంచలనం సృష్టించింది. 

2 /5

అయినా కూడా నాలుగో పెళ్లికి సిద్ధమయ్యిందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఆ హీరోయిన్ ఎవరు? ఆమె ఎందుకు అన్ని పెళ్లిళ్లు చేసుకుంది? అనే విషయం పైన ఇప్పుడు ఒకసారి చూద్దాం. 

3 /5

ఆ హీరోయిన్ ఎవరో కాదు వనిత విజయ్ కుమార్.. తెలుగు సినీ పరిశ్రమలో ప్రసిద్ధమైన నటిగానే కాకుండా వ్యాపారవేత్తగా, నిర్మాతగా, యూట్యూబర్గా మంచి పేరు సంపాదించుకున్నది.. ముఖ్యంగా ఈమె తండ్రి విజయ్ కుమార్ నటుడు అన్న సంగతి అందరికీ తెలిసిందే ఆయన వారసురాలు గానే ఈమె ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. చంద్రలేఖ అనే సినిమా ద్వారా మొదటిసారి తమిళ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది.. ఆ తర్వాత తెలుగులో దేవీ అనే చిత్రంలో నటించి మరింత ఆకట్టుకుంది. 

4 /5

అయితే వనిత విజయ్ కుమార్ సినిమాలలో కంటే వ్యక్తిగత జీవితాలతోనే భారీ క్రేజీ సంపాదించుకుంది. ముఖ్యంగా  వనిత విజయ్ కుమార్ ఏడేళ్లలోని ఏకంగా 3 పెళ్లిళ్లు చేసుకుని అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.  మొదట వనిత విజయ్ కుమార్..  ఆకాష్ అనే వ్యక్తిని ప్రేమించి, వివాహం చేసుకోగా వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఆ తర్వాత కొన్ని విభేదాలు రావడంతో విడిపోయారు. 

5 /5

మళ్లీ ఆనంద్ అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకోగా.. వీరికి ఒక కూతురు జన్మించింది. ఈ వివాహం కూడా ఎక్కువ రోజులు ఉండలేదట. ఇక మూడో వివాహంగా ఫోటోగ్రాఫర్ పీటర్ పాల్ ను వివాహం చేసుకోగా..  అది కూడా ఎక్కువ రోజులు నిలవలేదు. ఇప్పుడు కొరియోగ్రాఫర్ రాబర్ట్ తో నాలుగో వివాహానికి సిద్ధమయ్యింది అనే విధంగా ఇటీవలే వనిత విజయ్ కుమార్ ఒక సంచలన ప్రకటన చేశారు. దీంతో అందరూ ఆశ్చర్యపోవడమే కాకుండా ఈ నాలుగో పెళ్లి అయిన  సజావుగా సాగేలా చూసుకోవాలని తెలియజేస్తున్నారు