Sai Pallavi on national award: తండేల్ హీరోయిన్ సాయి పల్లవి తాజాగా జాతీయ అవార్డుపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్గా మారాయి. దీనిపై నెటిజన్లు తండేల్ బ్యూటిని ప్రశంసలు కురిపిస్తున్నారు.
తండేల్ మూవీ ప్రస్తుతం బాక్సాఫీక్ మీద అన్నిరికార్డులను తిరగరాస్తుంది. చాలా గ్యాప్ తర్వాత చైతుకు తండేల్తో మంచి హిట్ దొరికిందని చెప్పుకొవచ్చు. ఇటీవల తండేల్ ప్రమోషన్ లలో సైతం నాగార్జున చాలా ఎమోషనల్గా మాట్లాడారు.
చాలారోజుల తర్వాత మూవీ సక్సెస్ మీట్ లో పాల్గొన్నట్లు చెప్పారు. తన కోడలు శొభిత వచ్చిన వేళా విశేషమన్నారు. అందుకే ఈ మూవీ హిట్ ను సాధించిందన్నారు. మరొవైపు తండేల్ నటి సాయిపల్లవి కూడా ఒక రేంజ్ లో ఈ మూవీతో మరోసారి స్టార్ డమ్ సొంతం చేసుకుంది.
తండేల్ ను చందు మొండేటి తెరకెక్కించారు. అంతేకాకుండా.. అల్లు అరవింద్ సమర్పణలో.. బన్నీ వాసు దీన్ని నిర్మించారు. అయితే.. తండేల్ నటి సాయి పల్లవి ఇటీవల జాతీయ అవార్డు మీద చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్గా మారాయి.
తనకు 21 ఏళ్ల వయసులో అమ్మమ్మ ఒక చీర ఇచ్చిందని, పెళ్లి సమయంలో దాన్ని కట్టుకొవాలని చెప్పినట్లు చెప్పింది. అయితే.. సాయి పల్లవి తొలి చిత్రం ప్రేమమ్ నుంచి ఆమె ఇప్పటి వరకు అనేక హిట్ సినిమాల్లో నటించింది. ఈ క్రమంలో అప్పటి నుంచి తాను ప్రతిష్టాత్మకమైన అవార్డును ఏదో ఒక రోజు తప్పకుండా అందుకుంటానని గట్టిగా నమ్మినట్లు నటి చెప్పింది.
అయితే.. గతంలో సాయిపల్లవి నటించిన గార్గి మూవీకి నేషనల్ అవార్డు వస్తుందని అందరు భావించారు. కానీ అది చివరలో.. నిత్యమేనన్ కు దక్కింది. మరోవైపు సాయిపల్లవి తండేల్ మూవీ సక్సెస్ పై ఫుల్ జోష్ గా ఉన్నారు.
తండేల్ లో సాయిపల్లవి నటనకు ఆమెకు ఖచ్చితంగా జాతీయ అవార్డు వస్తుందని ఇటీవల అనేక మంది సోషల్ మీడియాలో కామెంట్లు సైతం చేస్తున్నారు. అయితే.. జాతీయ అవార్డు సాధించుకునే వరకు ఆ చీర ఒత్తిడి తనమీద ఎప్పుడు ఉంటుందని, దాని కోసం నేను ఎప్పుడు కష్టపడుతునే ఉంటానని సాయిపల్లవి తాజాగా కామెంట్లు చేశారు. ప్రస్తుతం సాయి పల్లవి కామెంట్స్ వార్తలలోనిలిచాయి.