H-1B visa: అమెరికా కల చెదురుతోందా? ఐటీ ఉద్యోగుల మెడపై వేలాడుతున్న H1B వీసాల కత్తి

Trump Can Change The Rules Of H-1b Visa: అమెరికాలో ట్రంప్ సర్కార్ కొలువు తీరేందుకు సమయం ఆసన్నమైంది. ఎన్నికల్లో విజయం తర్వాత ట్రంప్ విధానాలు ఎలా ఉండనున్నాయి భారత్ అమెరికా బంధం భవిష్యత్తులో ఎలా ఉండనుంది అనే విషయాల పైన ఇప్పుడు విరివిగా చర్చ జరుగుతుంది. నిజానికి డోనాల్డ్ ట్రంప్ విధానాలు భారతదేశానికి కొత్తేమీ కాదు ఆయన 2017 నుంచి 2021 వరకు అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎలాంటి విధానాలు అవలంబించారో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా భారతీయ టెకీ కంపెనీలకు ట్రంప్ సర్కార్ పెట్టిన వీసా కొర్రీలు అందరికీ తెలిసిన విషయమే. 
 

1 /8

Trump Can Change The Rules Of H-1b Visa: అమెరికాలో ట్రంప్ సర్కార్ కొలువు తీరేందుకు సమయం ఆసన్నమైంది. ఎన్నికల్లో విజయం తర్వాత ట్రంప్ విధానాలు ఎలా ఉండనున్నాయి భారత్ అమెరికా బంధం భవిష్యత్తులో ఎలా ఉండనుంది అనే విషయాల పైన ఇప్పుడు విరివిగా చర్చ జరుగుతుంది. నిజానికి డోనాల్డ్ ట్రంప్ విధానాలు భారతదేశానికి కొత్తేమీ కాదు ఆయన 2017 నుంచి 2021 వరకు అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎలాంటి విధానాలు అవలంబించారో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా భారతీయ టెకీ కంపెనీలకు ట్రంప్ సర్కార్ పెట్టిన వీసా కొర్రీలు అందరికీ తెలిసిన విషయమే.   

2 /8

ఓవైపు భారత్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, ప్రధాని మోదీ తనకు స్నేహితుడని చెబుతూనే ట్రంప్ సమయం దొరికినప్పుడల్లా భారత విధానాలను పలుమార్లు బహిరంగంగానే విమర్శించారు. ముఖ్యంగా వీసా విషయంలో అమెరికా ట్రంప్ హయాంలో కఠిన తరమైన నిబంధనలు ప్రవేశపెట్టే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఇది నేరుగా ఐటి కంపెనీల పైనే ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. దీంతో పాటు ఫార్మా కంపెనీలు సైతం అమెరికా తీసుకునే ప్రొటెక్షనిజం వైఖరి వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. 

3 /8

ఇప్పటికే డోనాల్డ్ ట్రంప్ మీ ఇంటికి వస్తే ఏమిస్తారు మా ఇంటికి వస్తే ఏం తెస్తారు అని తరహాలో మాట్లాడుతున్నారు. బిజినెస్ విషయంలో ట్రంప్ కఠినంగా ఉంటాడన్న సంగతి అందరికీ తెలిసిందే. గతంలో హార్లీ డేవిడ్సన్ మోటార్ సైకిల్ ల విషయంలో ట్రంప్ నేరుగానే భారత్ అమెరికా నుంచి దిగుమతి చేసుకునే మోటార్ సైకిల్ పైన పన్నులను తగ్గించాలని విమర్శించారు. 

4 /8

భారత్ తమ నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల పైన ఎలాంటి కఠిన వైఖరి వ్యవహరిస్తుందో, తమ దేశానికి భారత్ నుంచి వచ్చే దిగుమతుల పైన కూడా అలాంటి వైఖరి తీసుకునే ప్రమాదం ఉంటుందని ఇప్పటికే ట్రంప్ హెచ్చరించారు. ఒకవేళ ట్రంప్ ఈ విధంగా కఠినమైన వైఖరి వ్యవహరిస్తే భారత్ ఎగుమతులు నష్టపోయే ప్రమాదం ఉంటుంది. ఇప్పటికే ఇరుదేశాల మధ్య 200 బిలియన్ డాలర్ల వాణిజ్యం జరుగుతోంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే ట్రంప్ విధానాల వల్ల భారత్ ఎదుర్కొనే అసలు సమస్యల్లో చీకటి కోణంగా చెప్పవచ్చు. 

5 /8

ఇక ఇమిగ్రేషన్ విషయానికి వచ్చినట్లయితే ఇప్పటికే లక్షలాది మంది భారతీయులు అమెరికాలో దశాబ్దాలుగా పనిచేస్తూ ఇంకా గ్రీన్ కార్డు కోసం వేచి చూస్తున్నారు గ్రీన్ కార్డు వల్ల అమెరికాలో శాశ్వతంగా నివసించడానికి పనిచేయడానికి అనుమతి లభిస్తుంది.   

6 /8

గ్రీన్ కార్డు కోసం వేచి ఉన్న భారతీయుల సంఖ్య ఇప్పటికే 2023 నాటికి అమెరికా ఇమిగ్రేషన్ ఏజెన్సీ డేటా ప్రకారం 10 లక్షల వరకు ఉంది. అయితే ట్రంపు సర్కార్ కొలువు తీరితే నిబంధనలు మరింత కఠిన తరం అయ్యే అవకాశం ఉంటుందని ఇక గ్రీన్ కార్డ్ అనేది లక్షలాది మంది ప్రవాస భారతీయుల తీరని కలగా మారే అవకాశం ఉందని స్థానికంగా ఉండే భారతీయ ఐటీ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

7 /8

 H1B వీసాల విషయంలో సైతం ట్రంప్ సర్కార్ కఠినంగా ఉండే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు నిజానికి గత ఏడాది నాలుగు లక్షల మంది హెచ్ వన్ బి వీసా కోసం అప్లై చేసుకోగా వారిలో 85000 మందికి మాత్రమే లాటరీ పద్ధతిలో వీసా లభించింది. హెచ్ వన్ బి వీసాల విషయంలో కఠినమైన వైఖరి అవలంబించింది.

8 /8

 ముఖ్యంగా అమెరికాలో పనిచేసే భారతీయ ఐటీ కంపెనీలు కచ్చితంగా స్థానిక అమెరికాలకు ఉద్యోగాలు ఇవ్వాలని, అత్యవసరం అయితే తప్ప హెచ్ వన్ బి వీసాల ద్వారా భారతీయులను తమ కంపెనీలో పనిచేయించుకోవద్దని హెచ్చరించింది. అయితే ఈ వీసాల వీసాల పరిమితిని మరి కొంచెం తగ్గిస్తే మాత్రం భారతీయ ఐటీ కంపెనీలు అమెరికాలో పెద్ద ఎత్తున నష్టపోయే ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.