Telangana Liquor Sales: 11 రోజుల్లో..1000 కోట్లు.. మాములుగా తాగలే..


Telangana Liquor Sales:దసరా పండుగ సందర్భంగా రాష్ట్రంలో మద్యం అమ్మకాలు జోరుగా పెరిగాయి.  రాష్ట్రంలో 2,620 వైన్ షాపులతోపాటు వెయ్యికిపైగా బార్లు, క్లబ్‌లు, పబ్‌లు ఉన్నాయి. దసరాకు మందు భారీగా అమ్ముడుపోతుందని ముందే ఊహించిన వ్యాపారులు పెద్ద మొత్తంలో స్టాక్ నిల్వ చేసుకున్నారు. అంతేకాదు 11 రోజుల్లో వెయ్యి కోట్లకు పైగా అమ్మకాలు సాగాయి.

1 /6

అంచనా వేసినట్టే వైన్ షాపుల నిర్వాహకులు నిల్వ చేసుకున్న స్టాక్​ అంతా ఒక్క ఉదుటున సేల్ అయిపోయింది. దసరాకు ముందురోజు శుక్రవారమే రూ.205 కోట్ల స్టాక్‌ ఎక్సైజ్‌ డిపోల నుంచి వైన్ షాపులకు, బార్లకు, క్లబ్‌లకు, పబ్‌లకు చేరినట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

2 /6

ఇక ఈ నెల ఒకటో తేదీ నుంచి శుక్రవారం వరకు 11 రోజుల్లో రూ.1,057.42 కోట్ల విలువైన 10.44 లక్షల కేసుల లిక్కర్‌, 17.59 లక్షల కేసుల బీరు అమ్ముడు పోయినట్టు చెప్పారు.  

3 /6

ఇందులో ఈ నెల 10వ తేదీ వరకు రూ.852.4 కోట్ల విలువైన 8.36 లక్షల కేసుల లిక్కర్‌, 14.53 లక్షల కేసుల బీరు సేల్ అయింది.

4 /6

అయితే ఒక్క శుక్రవారం రోజునే ఎక్సైజ్‌ డిపోల నుంచి వైన్ షాపులకు రూ.205.42 కోట్ల విలువైన 2.08 లక్షల కేసుల లిక్కర్‌, 3.07 లక్షల కేసుల బీరు వైన్స్ నిర్వాహకులు తెచ్చుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

5 /6

అలాగే శని, ఆదివారాల్లో కూడా మద్యం రెట్టింపు స్థాయిలో అమ్ముడుపోయింది. మొత్తంగా ఈ 11 రోజుల్లో తెలంగాణలో  1000కోట్ల లిక్కర్ సేల్ జరిగినట్టు ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు.

6 /6

రాష్ట్రంలో 2,620 వైన్ షాపులతోపాటు వెయ్యికిపైగా బార్లు, క్లబ్‌లు, పబ్‌ లున్నాయి. శని వారం విజయ దశమితో పాటు ఆదివారం సెలవు కావడంతో మద్యం అమ్మకాలు రెట్టింపు స్థాయిలో జరిగినట్టు అధికార గణాంకాలు చెబుతున్నాయి.