Tata Nexon Cng On Road Price: సైలెంట్‌గా టాటా మోటర్స్‌ Cng కారు లాంచ్‌.. ఫీచర్స్‌తో పిచ్చెక్కిస్తోంది!

Tata Nexon Cng On Road Price: టాటా మోటర్స్‌ భారత మార్కెట్‌లోకి Nexon CNG కారును విడుదల చేసింది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌తో విడుదలైంది. దీనికి సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇప్పుడు తెలుసుకోండి.

Tata Nexon Cng On Road Price: టాటా మోటార్స్ సైలెంట్‌గా అద్భుతమైన కారును విడుదల చేసింది. ఈ కారును టాటా కంపెనీ నెక్సాన్ సిఎన్‌జి రెడ్ డార్క్‌ ఎడిషన్‌ అనే పేరుతో పరిచయం చేసింది. ఈ కారుకు సంబంధించిన పూర్తీ వివరాలను ఇటీవలే అధికారికంగా వెల్లడించింది. దీని ఎక్స్-షోరూమ్ ధరలు రూ. 12.70 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. అయితే దీని టాప్‌ ఎండ్‌ ధర రూ.13.69 లక్షలుగా ఉంటుందని కంపెనీ తెలిపింది. అయితే ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

1 /5

నెక్సాన్ సిఎన్‌జి (రెడ్ డార్క్‌ ఎడిషన్) కారును టాటా మోటార్స్ కంపెనీ మొత్తం మూడు వేరియంట్స్‌లో విడుదల చేసింది. ఇది యర్‌లెస్ + PS, క్రియేటివ్ + PSతో పాటు క్రియేటివ్ + S వేరియంట్స్‌లో లాంచ్‌ అయ్యింది. ఈ కారును కంపెనీ ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో అందుబాటులోకి తీసుకు వచ్చింది.    

2 /5

ఇక ఈ రెడ్ డార్క్ ఎడిషన్ కారుకు సంబంధించిన ఫీచర్స్‌ వివరాల్లోకి వెళితే.. ఈ కారు కార్బన్ బ్లాక్ ఎక్స్‌టీరియర్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ప్రీమియం డిజైన్‌తో అందుబాటులోకి వచ్చింది. ఈ కార్లలోని టాప్‌ వేరియంట్స్‌ 10.20-అంగుళాల డిజిటల్ డిస్‌ప్లేలను కలిగి ఉంటుంది.    

3 /5

అంతేకాకుండా రియర్ AC వెంట్‌లతో విడుదలైంది. అలాగే వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లతో పాటు LED లైటింగ్ ప్యాకేజీతో అందుబాటులోకి వచ్చింది. అలాగే వాయిస్ కమాండ్‌ సపోర్ట్‌ ఫీచర్‌ కూడా లభిస్తోంది. ఇందులో ఎంతో పెద్ద  పనోరమిక్ సన్‌రూఫ్‌ను కూడా అందిస్తోంది.     

4 /5

ఈ Nexon CNG కారు ఎంతో శక్తివంతమైన 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా దీని ఇంజన్‌ 170 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే ఇది  6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో లాంచ్‌ అయ్యింది. ఇది CNG వేరియంట్‌లో అందుబాటులో ఉంది. కాబట్టి దీని ట్యాంక్ సామర్థ్యం 60 లీటర్లు ఉంటుంది.     

5 /5

ఇక ఈ కారకు బ్యాక్‌ సెటప్‌లో 321 లీటర్లు బూట్ స్పేస్‌ను కూడా అందిస్తోంది. అంతేకాకుండా టాటా కంపెనీ ఈ కారు 17.44 km/kg వరకు మైలేజీ క్లెయిమ్ చేస్తున్నట్లు తెలిపింది. అంతేకాకుండా హైవేలపై 17.5 km/kg వరకు మైలేజీని అందించే ఛాన్స కూడా ఉంది. ఈ కారులో బేస్‌ వేరియంట్‌ క్రియేటివ్ + S రూ. 12.70 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.