sukanya samriddhi yojana : కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన సుకన్య సమృద్ధి యోజన కింద ప్రతినెల మీరు డబ్బును పొదుపు చేసినట్లయితే మీరు పొదుపు చేసిన డబ్బు 21 సంవత్సరాల నాటికి 64 లక్షల రూపాయలు అవుతుంది. ఇది ఎలాగో ప్రతినెల ఎంత పొదుపు చేయాలో ఎక్కడ పొదుపు చేయాలో తెలుసుకుందాం.
sukanya samriddhi yojana Scheme : మన దేశంలో ఆడబిడ్డను పెంచడం అంటే ఒక అదనపు బాధ్యత భావిస్తారు. అమ్మాయికి చదువు, వివాహం ఇలా అన్ని విషయాల్లోనూ తల్లిదండ్రులు ఎంతో జాగ్రత్తగా ఉంటారు. ముఖ్యంగా పెరుగుతున్న ఖర్చులు నేపథ్యంలో వివాహం విషయంలో లక్షలాది రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది అందుకే ఆడపిల్లలను పుట్టినప్పటినుంచి కూడా వారి పేరిట డబ్బులు దాచేందుకు జనం ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు.
ఇందుకోసమే ఆడపిల్లలకు ప్రయోజనం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం పోస్ట్ ఆఫీస్ వారు ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ధి యోజన చాలా ఉపయోగపడుతుంది. ఈ స్కీములో మీరు డబ్బు దాచుకున్నట్లయితే అమ్మాయి 21 సంవత్సరాల యుక్త వయసుకు వచ్చేనాటికి ఖాతాలో ఆమె పేరిట 64 లక్షల రూపాయల వరకు జమ చేయవచ్చు. ఈ స్కీం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
సుకన్య సమృద్ధి యోజన కింద, తల్లిదండ్రులు తమ కుమార్తెకు 10 ఏళ్లు నిండకముందే ఖాతా తెరవవచ్చు. ఒక పెట్టుబడిదారుడు తన కుమార్తె పుట్టిన వెంటనే పథకంలోSSY ఖాతా తెరిస్తే, 15 సంవత్సరాల పాటు డబ్బును డిపాజిట్ చేయవచ్చు. అమ్మాయికి 18 ఏళ్లు నిండినప్పుడు, మెచ్యూరిటీ మొత్తంలో 50 శాతం విత్‌డ్రా చేసుకోవచ్చు. కుమార్తెకు 21 ఏళ్లు నిండిన తర్వాత మిగిలిన మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు.
మీరు సుకన్య సమృద్ధి ఖాతాలో ప్రతి నెలా రూ. 12,500 జమ చేస్తే, ఈ మొత్తం ఏడాదికి రూ. 1.5 లక్షలు అవుతుంది. ఈ మొత్తంపై ఎలాంటి పన్ను ఉండదు. మెచ్యూరిటీపై వడ్డీ రేటును 7.6 శాతంగా తీసుకుంటే, ఆ ఖాతాదారుడు తన కుమార్తె కోసం మెచ్యూరిటీ వరకు భారీ మొత్తంలో ఫండును సిద్ధం చేయవచ్చు. పెట్టుబడిదారుడు తన కుమార్తెకు 21 ఏళ్లు వచ్చేసరికి మొత్తం మొత్తాన్ని విత్‌డ్రా చేస్తే, మెచ్యూరిటీ మొత్తం రూ.63 లక్షల 79 వేల 634 అవుతుంది. ఇందులో ఖాతాదారుడు పెట్టుబడి పెట్టిన మొత్తం రూ.22,50,000 మాత్రమే. ఇది కాకుండా వడ్డీ ఆదాయం రూ.41,29,634. ఈ విధంగా సుకన్య సమృద్ధి ఖాతాలో ప్రతి నెలా రూ.12,500 జమచేస్తే.. మీ కుమార్తెకు 21 ఏళ్లు వచ్చేసరికి దాదాపు రూ.64 లక్షలు వస్తాయి.
పెట్టుబడిదారులు సుకన్య సమృద్ధి యోజనలో సంవత్సరానికి రూ. 1.50 లక్షల వరకు పెట్టుబడిపై ఆదాయపు పన్ను మినహాయింపు పొందవచ్చు. ఈ పథకంలో ఏడాదిలో గరిష్టంగా రూ.1.5 లక్షలు డిపాజిట్ చేయవచ్చు. సుకన్య సమృద్ధి యోజన EEE హోదాతో వస్తుంది. అంటే మూడు చోట్ల పన్ను మినహాయింపు లభిస్తుంది. సుకన్య సమృద్ధి పథకంలో పెట్టుబడి పెట్టిన మొత్తంపై పన్ను మినహాయింపు లభిస్తుంది. ఈ పథకం ద్వారా వచ్చే వడ్డీ కూడా పన్ను రహితం అని గుర్తించాలి. ఇది కాకుండా, ఈ పథకంలో మెచ్యూరిటీ మొత్తం కూడా పన్ను రహితం.