Solar Eclipse 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. సూర్యగ్రహణం ఏర్పడడం కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. దీంతో పాటు వారికి కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Surya Grahan 2024: ఖగోళ శాస్రం ప్రకారం ప్రతి సంవత్సరం సూర్య, చంద్ర గ్రహణాలు ఏర్పడతాయి. ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా ఏప్రిల్ 8న మొదటి సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. ఈ గ్రహణం రాత్రి 9.12 గంటలకు ప్రారంభమవుతుంది. ఆ తర్వాత మరసటి రోజున తెల్లవారుజామున 1.25 గంటలకు ముగుస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యగ్రహాణాకి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ సూర్యగ్రహణం కారణంగా శుభ, అశుభ పరిణాలు ఏర్పడతాయి. ఈ సంవత్సరం ఏర్పడబోయే సూర్యగ్రహణం కారణంగా దాదాపు 7.5 నిమిషాల పాటు సూర్యుడు కనిపించకుండా ఉంటారని ఖగోళ శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
ఈ సూర్యగ్రహణం కారణంగా ఏప్రిల్ నెల కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. మరికొన్ని రాశులవారు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే ఈ మొదటి సూర్యగ్రహణం కారణంగా ఏయే రాశులవారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
సూర్యగ్రహణం సంభవించడం వల్ల ఏప్రిల్ నెల మేష రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో వీరు శత్రువులను జయిస్తారు. అంతేకాకుండా కార్యాలయంలో గౌరవం కూడా రెట్టింపు అయ్యే ఛాన్స్ ఉందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
అంతేకాకుండా ఈ సమయంలో మేష రాశివారికి ఆరోగ్యం కూడా మెరుగుపడే ఛాన్స్ ఉంది. దీంతో పాటు వైవాహిక జీవితం కూడా మధురంగా ఉంటుంది. ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభించి, ఊహించని లాభాలు కలుగుతాయి.
మిథున రాశి వారికి ఈ సూర్యగ్రహణం ఏర్పడడం కారణంగా కుటుంబంలో సంతోషం కూడా పెరుగుతుంది. అంతేకాకుండా వీరికి ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. అలాగే అనారోగ్య సమస్యలు కూదా దూరమవుతాయి.
ముఖ్యంగా వైవాహిక జీవితం గడుపుతున్నవారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. అలాగే ఆర్థికంగా కూడా అనేక రకాల ప్రయోజనాలు పొందుతారు. దీంతో పాటు ఆత్మవిశ్వాసం కూడా రెట్టింపు అవుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
ధనుస్సు రాశి వారికి ఈ సమయంలో సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది. అంతేకాకుండా ఉద్యోగాలు చేస్తున్నవారికి ఊహించని లాభాలు కూడా కలుగుతాయి. దీంతో పాటు వ్యాపారాలు చేసేవారికి లాభాలు కూడా రెట్టింపు అవుతుంది.