Daaku Maharaaj 9 days Collections: బాలయ్య ‘డాకు మహారాజ్’ 9 డేస్ బాక్సాఫీస్ కలెక్షన్స్.. ఇంతకీ లాభాల్లోకి వచ్చిందా..!

Daaku Maharaaj 9 days Collections: తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ టాప్ హీరోల్లో బాలకృష్ణ మంచి జోరు మీదున్నాడు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాల విజయం తర్వాత ‘డాకు మహారాజ్’ తో మరో సక్సెస్ ను అందుకున్నాడు. నిన్నటితో బాక్సాఫీస్ దగ్గర 9 రోజులు పూర్తి చేసుకుంది. మొత్తంగా బ్రేక్ ఈవెన్ కు ఎంత దూరంలో ఉందంటే..

 

1 /6

Daaku Maharaaj 9 days Collections: సీనియర్ టాప్ స్టార్స్ లో  బాలయ్య వరుస సక్సెస్ లతో ఫుల్ జోష్ లో ఉన్నారు. అంతేకాదు వరుస హిట్స్ తో  జైత్రయాత్ర చేస్తున్నాడు.లేటెస్ట్ గా  ‘డాకు మహారాజ్’ చిత్రంతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.

2 /6

‘డాకు మహారాజ్’ సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదలై తొలి రోజు నుంచి మంచి వసూళ్లనే రాబడుతోంది. అంతేకాదు బాలయ్య కెరీర్ లో వరుసగా  నాల్గో  రూ. 100 కోట్ల గ్రాస్ క్లబ్బులో ప్రవేశించిన సినిమా. అంతేకాదు వరుసగా  బాక్సాఫీస్ దగ్గర రూ. 70 కోట్ల షేర్ అందుకున్న 4వ సినిమాగా బాలయ్య ఖాతాలో రికార్డు క్రియేట్ చేసింది.

3 /6

‘డాకు మహారాజ్’ 8 రోజుల్లో రూ. 156 కోట్ల గ్రాస్.. రూ. 78 కోట్ల షేర్ అందుకుంది. 9వ రోజు ఈ మూవీ దాదాపు రూ. 1 కోటి పైగా షేర్ రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రూ. 2 కోట్ల షేర్ అందుకుంటే ఈ సినిమా క్లీన్ హిట్ గా నిలువనుంది. 

4 /6

60  ప్లస్ ఏజ్ లో  వరుసగా నాలుగు వరుస సక్సెస్ లు అందుకోవడంతో కంటిన్యూగా  నాలుగు రూ. 100 కోట్ల గ్రాస్.. రూ 70 కోట్ల షేర్ అందుకున్నసీనియర్ టాప్ స్టార్  గా బాలయ్య రికార్డు పదిలం అని చెప్పాలి. సీనియర్ స్టార్స్ లో ఎవరు ఈ రికార్డును బ్రేక్ చేయడం ఎవరి తరం కాదు.   తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్ ను రేపు అనంతపురంలో నిర్వహించనున్నారు. 

5 /6

అమెరికాలో  వరుసగా నాలుగు వన్ మిలియన్ డాలర్స్ కొల్లగొట్టిన సీనియర్ స్టార్ హీరోగా రికార్డు క్రియేట్ చేసారు.ఈ సినిమా ఓటీటీ హక్కులు రూ. 50 కోట్లకు  నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. ఈ సినిమా  ఫిబ్రవరి 5 నుంచి నెట్ ఫ్లిక్స్ లో ఐదు భాషల్లో స్ట్రీమింగ్ కు రానుంది. 

6 /6

తెలుగులో  బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ‘డాకు మహారాజ్’ చిత్రం తమిళనాడులో రిలీజై మంచి వసూల్లతో దూసుకుపోతుంది. ఈ సినిమా తర్వాత బాలయ్య ‘అఖండ 2 తాండవం’ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం కుంభమేళాలో జరగుతున్న షూటింగ్ లో బాలయ్య జాయిన్ కానున్నారు. అంతేకాదు మహా శివరాత్రి సందర్బంగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.