Shruthi Haasan: అడివి శేష్ డికాయిట్ మూవీ నుంచి తప్పుకున్న శృతిహాసన్.. కారణం హీరోనే..?

Shruti Haasan walks out Dacoit : శృతిహాసన్ త్వరలో..అడివి శేష్ తో డెకాయిట్ సినిమాలో కనిపించనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా నుంచి ఇప్పుడు.. శృతిహాసన్ తప్పుకున్నట్లు తెలుస్తోంది. అది కూడా ఈ సినిమా హీరోతో డిఫరెన్స్ రావడం వల్ల ఇలా జరిగింది అని వార్తలు తెగ వినిపిస్తున్నాయి. పూర్తి వివరాలు మీకోసం.‌
 

1 /5

ప్రముఖ యంగ్ హీరో అడివి శేష్ తో స్టార్ హీరోయిన్ శృతిహాసన్ కలిసి నటిస్తున్న చిత్రం డెకాయిట్. అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి ఈమె తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. యాక్షన్ ఓరియంటెడ్ మూవీ గా వస్తున్న ఈ సినిమాలో అడివి శేష్ , శృతిహాసన్ గజదొంగలుగా నటిస్తున్నట్లు వార్తలు వినిపించాయి.  అయితే ప్రాజెక్టులో భాగంగా ఒక పార్ట్ షూటింగ్ కూడా పూర్తయిందని , కానీ ఇప్పుడు సడన్గా ఈమె తప్పుకుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. 

2 /5

శృతిహాసన్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. అందులో భాగంగానే సలార్ -2, కూలీ, చెన్నై స్టోరీ వంటి ప్రాజెక్టులు ఈమె చేతిలో ఉన్నాయి. దీనికి తోడు డెకాయిట్ సినిమాలో కూడా ఈమె అవకాశాన్ని దక్కించుకుంది. క్షణం, గూడచారి వంటి సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన షానీల్ డియో ఈ చిత్రానికి  దర్శకత్వం వహిస్తున్నారు.  అంతేకాదు ఈ సినిమాతో తొలిసారి దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు.  

3 /5

ఈ యాక్షన్ ఫిలిం లో వీరిద్దరూ హీరో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇదిలా వుండగా.. శృతి హాసన్ , సినిమా మేకర్స్ మధ్య వచ్చిన చిన్నపాటి విభేదాలే ఈ ప్రధాన నిర్ణయానికి కారణమని తెలుస్తోంది.   

4 /5

నిజానికి ఈ సినిమా షూటింగ్ సగానికి పైగా పూర్తయింది.. ఈ మూవీ నుంచి ఇప్పుడు హీరోయిన్ శృతిహాసన్ తప్పుకుందంటూ ఒక వార్త వినిపిస్తోంది.  డేట్స్ ఇష్యూ కారణంగా శృతిహాసన్ ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే అనుకున్న సమయానికి షూటింగ్ జరగకపోవడం వల్ల ఆమె తప్పుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం శృతిహాసన్ రజినీకాంత్ నటించిన కూలీ తోపాటు చెన్నై స్టోరీస్ సినిమా షూటింగ్లలో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలోని డేట్స్ సెట్ కాకపోవడం వల్ల సినిమా నుండి తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

5 /5

దీనికి తోడు సినిమా బడ్జెట్ అమాంతం పెరిగిపోయింది. అదీ కాకుండా శృతిహాసన్ ప్లేస్ లో మరొకరిని పెట్టడం అంటే కష్టంతో కూడుకున్న పని. దీంతో అడివి శేష్ సినిమాకి మరిన్ని కష్టాలు వచ్చేలా కనిపిస్తున్నాయి.. మొత్తానికైతే ఈ రూమర్స్ పై క్లారిటీ రావాలంటే మేకర్స్ ప్రకటించే వరకు ఎదురు చూడాల్సిందే.