Shat tila Ekadashi Vratam 2025: షట్ తిల ఏకాదశి అనేది శ్రీమహా విష్ణువుకు అత్యంత ఇష్టమైందని చెబుతుంటారు. ఈరోజున కొన్ని పరిహారాలు పాటిస్తే జీవింతంలో అనే సమస్యల నుంచి బైటపడొచ్చు.
సాధారణంగా ఏడాదికి 12 ఏకాదశి తిథులు వస్తుంటాయి.ప్రతి నెల రెండు ఏకాదశి తిథులు వస్తాయి. అది అది కృష్ణ పక్షంలో ఒకటి, మరోకటిఅది శుక్ల పక్షంలో వస్తుంది. అందుకే ఈ తిథులు చాలా ప్రాముఖ్యమైనవిగా పండితులు చెబుతుంటారు.
ముఖ్యంగా పుష్య మాసంలో వచ్చే షట్ తిల ఏకాదశి చాలా శక్తివంతమైందని పండితులు చెబుతున్నారు. ఈసారి షట్ తిల ఏకాదశి శనివారం అంటే జనవరి 25 వ తేదీన వస్తుంది. ఈరోజున కొన్ని పరిహారాలు పాటించాలని పండితులు చెబుతున్నారు.
షట్ తిల ఏకాదశి రోజున ఉదయం నిద్రలేవాలి. నువ్వుల నూనెను ఒంటి నిండాపెట్టుకొవాలి. కొన్ని నువ్వుల్ని.. మనం స్నానం చేసే బుకెట్ లో వేసుకుని స్నానం చేయాలి. ఆ తర్వాత శుభ్రమైన బట్టలువేసుకుని దేవుడి దగ్గర దీపారాధాన చేయాలి.
ముఖ్యంగా షట్ తిల ఏకాదశి రోజున నువ్వులు, బెల్లంలతో చేసిన లడ్డును దేవుడికి నైవేద్యంగా సమర్పించాలి. ఈరోజున పూర్వికులు అంటే చనిపోయిన మనవంశంవారికి శ్రాద్దకర్మాదికాలు చేస్తే మంచి జరుగుతుందని చెబుతుంటారు. అందుకే ఈరోజున దాన ధర్మాలు చేయాలి.
పితృ దేవతలకు తిల ఉదకం సమర్పించాలి. నువ్వులు కాని, నువ్వుల నూనె కాని ఒక బ్రాహ్మణునికి దానంగా ఇవ్వాలి. అంతే కాకుండా.. ఈ రోజున బెల్లం లేదా స్వీట్లను పేదవారికి దానంగా ఇవ్వాలి. నదీ స్నానం చాలా ప్రాముఖ్యమైందని చెబుతుంటారు. నువ్వుల లడ్డుల్ని చేసి.. వాటిని పిల్లలకు పంచిపెట్టాలి.
పై విధంగా చేస్తే జీవితంలో డబ్బులకు లోటు ఉండదని పండితులు చెబుతున్నారు. అదే విధంగా ఉద్యోగంలో ప్రమోషన్ కూడా గ్యారంటీ అని పండితులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఏలినాటి శని ప్రభావం ఉన్న వారు ఈరోజున ఉపవాసం, శనిదేవుడికి తైలాభిషేకం చేయిస్తే గొప్ప ప్రయోజనాలు కల్గుతాయని పండితులు చెబుతున్నారు. ( ఇది సోషల్ మీడియా కంటెంట్ ఆధారంగా రాయడం జరిగింది.. జీ మీడియా దీన్ని ధృవీకరించలేదు..)