Shani Dev: మీ జీవితంలో ఈ మార్పులు కన్పిస్తున్నాయా..?. వెంటనే శనీశ్వరుడికి ఈ పూజలు చేయించుకొండి..

Shani dev effect: సాధారణంగా శనీశ్వరుడు ప్రతి ఒక్కరి జాతకంలో కూడా తన ప్రభావం చూపిస్తుంటారు. అయితే..మనం చేసుకున్న కర్మలను బట్టి మాత్రమే శనీదేవుడి అలాంటి ఫలితాలను ఇస్తాడు.

1 /6

నవగ్రహాలలో శనీశ్వరుడు అత్యంత శక్తివంతమైన గ్రహాంగా చెప్తుంటారు. శనీదేవుడు సూర్యుడి కుమారుడు. యమధర్మరాజు సోదరుడు. ఆయన అనుగ్రహాం ఉంటే.. ఓవర్ నైట్లో జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి.  

2 /6

శనీశ్వరుడి దయ వల్ల జీవితంలో ఎన్నో మార్పులు సంభవిస్తాయి. శనీశ్వరుడు కొంత మంది మంచి యోగాన్ని కల్గజేస్తే మరికొందరికి అంతే కష్గాలను కూడా కల్గజేస్తాడు. ఇవన్ని కూడా వారి వారి కర్మలను బట్టి ఉంటాయి.  

3 /6

అయితే.. అసలు.. శనీ ప్రభావం ఎలా ఉంటుంది. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శనీ ఏలీనాటి, సాడేసాతి, అర్ధష్టమ మొదలైన విధానంలో శనీదేవుడు మనపై ప్రభావం చూపిస్తాడు. ఈ కాలంలో శనీదేవుడు ఆయా వ్యక్తులు చేసుకున్న కర్మలను అనుసరించి ఫలితాలను ఇస్తాడు

4 /6

శనీదేవుడు జాతకంలో చెడు స్థానంలో ఉంటే..జీవితంలో ఎలాంగి ఎదుగు బొదుగు ఉండదు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంలా ఉంటుంది. ముఖ్యంగాఉద్యోగం, వ్యాపారం, పెళ్లి జీవితంలో అస్సలు ముందుకు పోవడమే ఉండదు. ఏ పనిచేసిన కూడా కలిసి రాదు.  

5 /6

ప్రతి ఒక్కరితో కూడా విభేదాలు ఏర్పడతాయి.  మాట్లాడటానికి వచ్చేవాడు కూడా.. పోట్లాడి పొతాడు. అదే విధంగా ఏ పనిమొదలేట్టిన అది మధ్యలోనే ఆగిపోతుంది. ఏదైన చేయాలన్న తపన అస్సలు ఉండదు. డబ్బులు మంచి నీళ్లలా ఖర్చు అయిపోతాయి. తరచుగా ఏదైన ప్రమాదాలు చోటు చేసుకుంది.

6 /6

ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. ఇలాంటి వారు ముఖ్యంగా శనీవారం.. నువ్వుల నూనెతో శనీకి తైలాభిషేకం చేయించుకొవాలి. నల్లని బట్టలు, నవధాన్యాలు పండితులకు దానంగా ఇవ్వాలి. ఆవులకు, కుక్కలకు ఆహారం పెట్టాలి. పెదవాళ్లకు అన్నదానం,వస్త్రదానం వంటివి చేయాలి.  ఇలాంటివి చేస్తే శనీదోషం పూర్తిగా పొతుందని పండితులు చెబుతున్నారు.