Shani Powerful Effect: జ్యోతిష్య శాస్త్రం పరంగా మార్చి 28న చాలా ప్రత్యేకతను కలిగి ఉంటుంది. ఎందుకంటే ఈ రోజే ఎంతో శక్తివంతమైన గ్రహంగా పిలుకునే శని కుంభ రాశిని వదిలి మీన రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. అయితే శని వెండి పాదాలతో కదిలికలు జరపడం వల్ల కొన్ని రాశులవారికి చాలా మేలు జరుగుతుంది. అలాగే శని రెండున్నర ఏళ్ల తర్వాత సంచారం చేయబోతున్నాడు. కాబట్టి ఈ సమయంలో ఎంతో శక్తివంతమైన ప్రభావం అన్ని రాశులవారిపై సమానంగా పడుతుంది.
ముఖ్యంగా శని సంచారం కారణంగా ఏలినాటి శనితో బాధపడుతున్న కొన్ని రాశులవారికి కాస్త ఉపశమనం కలుగుతుంది. అలాగే వ్యాపారాల్లో వస్తున్న సమస్యలతో పాటు ఉద్యోగాల్లో ఎదుర్కొంటున్న సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. అంతేకాకుండా ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది.
శని మీన రాశిలోకి మార్చి 28వ తేదిన ప్రవేశించడం వల్ల కన్యరాశి వారికి చాలా మేలు జరుగుతుంది. వీరికి ఆనందంతో పాటు శ్రేయస్సు కూడా రెట్టింపు అవుతుంది. అలాగే ఉద్యోగాల్లో కష్టపడి పని చేసేవారికి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే ఆర్థికంగా కూడా చాలా బాగుంటుంది.
కన్య రాశివారికి కుటుంబ పరిస్థితుల్లో కూడా బోలెడు మార్పులు వస్తాయి. వీరికి అప్పుల బాధలు కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా వీరికి జీవితంలో ఆనందంతో పాటు శ్రేయస్సు కూడా లభిస్తుంది. ముఖ్యంగా కష్టపడి ఉద్యోగాలు చేసేవారికి ఈ సమయం చాలా బాగుంటుంది.
కన్య రాశివారికి ఆర్థింగా కూడా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. వీరికి వ్యాపారాల్లో లాభాలు రావడం కూడా ప్రారంభమవుతాయి. దీంతో పాటు భూమి సంబంధింత సమస్యలు కూడా దూరమవుతాయి. అలాగే ఇంట్లో కొన్ని శుభకార్యాలు కూడా జరుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
వృషభ రాశివారికి కూడా శని సంచారం చాలా అద్భుతంగా ఉంటుంది. వీరికి ఈ సమయంలో శుభ సమయం ప్రారంభమవుతుంది. దీంతో పాటు వ్యాపారాల్లో ఆర్థిక స్థితిగతులు కూడా చాలా వరకు మెరుగుపడతాయి. వ్యాపారాలు చేసేవారు ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం చాలా శుభప్రదంగా భావిస్తారు.
వృషభ రాశివారికి కెరీర్ సంబంధిత సమస్యలు కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా సంబంధాలు కూడా బలోపేతమవుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అలాగే ఈ రాశిలో జన్మించవారికి శని ప్రభావం వల్ల ఆరోగ్యం కూడా చాలా వరకు బాగుంటుంది. సంబంధాలు కూడా బలోపేతమవుతాయి.
ఈ మార్చి 28వ తేది నుంచి మకర రాశివారికి ఏలినాటి శని తొలగిపోతుంది. దీని కారణంగా వీరికి ఈ సమయంలో అదృష్టం కూడా రెట్టింపు అవుతుంది. వ్యాపారాలు చేసేవారికి భారీ మొత్తంలో లాభాలు రావడం ప్రారంభమవుతాయి. అలాగే డబ్బు కూడా ఊహించని స్థాయిలో తిరిగి వస్తాయి.
మకర రాశివారికి ఈ సమయంలో జీవితం కూడా ఆనందం కూడా రెట్టింపు అవుతుంది. ఉద్యోగాలు చేసేవారికి భారీ మొత్తంలో ప్రమోషన్స్ కలుగుతాయి. అలాగే ఆర్థికంగా కూడా ఎంతో మేలు జరుగుతుంది. కుటుంబంలో తండ్రి లేదా ఇతరుల నుంచి ఆర్థిక సహాయం కూడా లభిస్తుంది. ఎంతో కాలంగా ఉన్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి.