Shah Rukh Khan: తెలుగు హీరోలు అవి తగ్గించుకుంటే బాగుంటుందన్న షారుఖ్.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అభిమానులు..!

Shah Rukh Khan Shocking Comments: షారుఖ్ ఖాన్ సౌత్ ఇండియా హీరోల గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం. ఆయన మాట్లాడుతూ, "రజనీకాంత్ సార్, కమల్ హాసన్ సార్" అని సీనియర్ నటులపై తన గౌరవాన్ని వ్యక్తం చేశారు. వారి పట్ల ఉన్న అభిమానాన్ని, గౌరవాన్ని తెలియజేశారు. మరోపక్క తెలుగు హీరోల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ మాటలు చెప్పుకొచ్చారు ఈ హీరో.
 

1 /5

షారుఖ్ ఖాన్ ఈమధ్య ఒక ఈవెంట్ కి అటెండ్ కాగా.. అక్కడ సౌత్ హీరోల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్యనే షారుఖ్ సౌత్ ఇండియాలో కూడా మంచి పాపులారిటీ తెచ్చుకుంటున్న సంగతి తెలిసిందే. జవాన్, పఠాన్ చిత్రంతో.. సౌత్ లో కూడా బ్లాక్ బస్టర్ విజయాలు సాధించారు. ఈ క్రమంలో సౌత్ హీరోల గురించి ఈ హీరో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అందరిని ఆకట్టుకుంటున్నాయి.

2 /5

ఇక ఈ మధ్య జరిగిన ఒక ఈవెంట్ లో మాట్లాడుతూ.. తనకు దక్షిణ భారతదేశంలో ఎంతోమంది స్నేహితులున్నారన్నారు. అయితే వారందరికీ ఒకటే రిక్వెస్ట్ అని.. వాళ్లు కొన్ని  మానుకోవాలని కోరారు. ముఖ్యంగా ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటివారిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేస్తున్నానని చెప్పకొచ్చారు.   

3 /5

ఇంతకీ షారుక్ చెప్పినది దేని గురించి అంటే.. వారి డాన్స్. ఆయన మాట్లాడుతూ, "ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి హీరోలు ఎంతో వేగంగా డ్యాన్స్ చేస్తారు. నేను అలాంటి వేగాన్ని అందుకోలేను, కాబట్టి వాళ్లు అవి కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది" అని తెలిపారు. 

4 /5

ఫ్యాన్స్ ఈ వ్యాఖ్యలపై విభిన్నమయిన స్పందనలు తెలియజేస్తున్నారు. మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి ప్రముఖులు షారుక్‌కు అభిమానం తెలియజేయగా.. జూనియర్ ఎన్టీఆర్.. పవన్ కల్యాణ్ గురించి షారుక్ మాట్లాడకపోవడం వల్ల.. వారి అభిమానులను కొంచెం ఆగ్రహానికి గురిచేసింది. "ఎన్టీఆర్, పవన్ కల్యాణ్ పేర్లు ఎందుకు చెప్పలేదు?" అని అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా అసలు మహేష్ బాబు ప్రభాస్ డాన్సులు వేస్తారా..? వారి పేర్లు చెప్పి జూనియర్ ఎన్టీఆర్ పేరు చెప్పకపోవడం ఏంటి అని మరి కొంతమంది కామెంట్లు పెడుతున్నారు.

5 /5

షారుక్ ఖాన్ దక్షిణ భారత నటులతో మంచి స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. అయితే, వీరిలో కొందరినే మాత్రమే ప్రస్తావించడం, హీరోల అభిమానుల మధ్య వాదనలకు దారితీస్తోంది.