Team India Crickets in Maha Kumbh Mela 2025: ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సంగమం కుంభమేళా ప్రతిష్టాత్మకంగా జరుగుతోంది. కోట్లాది మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. మొత్తం 45 రోజుల పాటు ఈ మహా క్రతువుకు దేశవిదేశాల నుంచి భక్తులు భారీగా తరలిస్తువస్తున్నారు. ఈ క్రమంలోనే టీమిండియా స్టార్ క్రికెటర్లు కూడా కుంభమేళాను దర్శించుకున్నట్ల నెట్టింట పిక్స్ వైరల్ అవుతున్నాయి. మరి నిజమో కాదో ఇక్కడ తెలుసుకోండి.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి వచ్చిన తరువాత టెక్నాలజీలో కొత్త యుగం మొదలైంది. నెటిజన్లు తమకు ఇష్టం వచ్చిన రీతిలో ఏఐను వినియోగిస్తున్నారు.
తాజాగా ప్రయాగ్‌రాజ్ కుంభమేళాకు క్రికెటర్లు హాజరైనట్లు ఏఐ సాయంతో పిక్స్ క్రియేట్ చేశారు. ఆటగాళ్లందరూ కాషాయ దుస్తులు ధరించి ఉన్నారు.
ఈ పిక్స్‌ను చూసి నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు. ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్ మధ్య గ్యాప్‌లో కుంభమేళాకు ఎలా వచ్చారని ఆశ్చర్యపోతున్నారు.
ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, శ్రేయాస్ అయ్యార్, హార్థిక్ పాండ్యా, సంజూ శాంసన్, కేఎల్ రాహుల్, జైస్వాల్ ప్లేయర్లను సాధువులుగా మార్చారు.
ఏఐ జనరేటెడ్ పిక్స్‌ను ది భారత్ ఆర్మీ క్రియేట్ చేసింది. "క్రికెటర్లు మహా కుంభమేళాకు వెళితే.." క్యాప్షన్‌తో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.