Sankranti Bank Holidays Extended: సంక్రాంతి సందర్భంగా ఊరూవాడా అంతా సెలబ్రేట్ చేసుకునే సమయం. ఈ సందర్భంగా స్కూళ్లు, ఇతర విద్యాసంస్థలకు సెలవులు వచ్చాయి. అయితే, బ్యాంకు ఉద్యోగులకు కూడా సెలవు ఇచ్చారు. అయితే, తాజాగా ఆంధ్రప్రదేశ్లో బ్యాంకు ఉద్యోగులకు సంక్రాంతి బంపర్ ఆఫర్ ప్రకటించారు జనవరి 15వ తేదీన కూడా సెలవు ప్రకటించారు.
సంక్రాంతి సందర్భంగా బ్యాంకులకు జనవరి 14వ తేదీ సెలవు ఇచ్చారు. మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు మరికొన్ని రాష్ట్రాల్లో కూడా పొంగల్, లోహ్రీ అని వేర్వేరు ప్రాంతాల్లో జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో బ్యాంకులకు సెలవు ఇచ్చారు.
అయితే, ఆంధ్రప్రదేశ్లో బ్యాంకు ఉద్యోగులకు బంపర్ ఆఫర్. ఎందుకంటే జనవరి 14వ తేదీ మాత్రమే కాదు జనవరి 15వ తేదీ కూడా సెలవు ఇచ్చి తీపి కబురు అందించింది. యూనైటెడ్ ఫోరమ్ ఫర్ బ్యాంక్ యూనియన్స్, ఏపీ స్టేట్ యూనిట్ ప్రభుత్వాన్ని కోరింది.
ఈనేపథ్యంలో ప్రభుత్వం 15వ తేదీ కనుమ పండుగ సందర్భంగా కూడా బ్యాంకులకు సెలవు ప్రకటించింది. గత సంవత్సరం డిసెంబర్ 6న జారీ చేసిన జీవో నంబర్ 2116కు సవరణ చేసింది. దీంతో బ్యాంకులకు మరో రోజు అదనంగా సెలవు వచ్చింది.
బ్యాంకులకు జనవరి 14 మాత్రమే కాదు 15 రెండు రోజులు వరుసగా సెలవులు వచ్చాయి. ఇది బ్యాంకు ఉద్యోగులకు పండుగ చేసుకునే వార్త. ఇప్పటికే స్కూళ్లు ఇతర విద్యాసంస్థలకు కూడా 19వ తేదీ వరకు సెలవు ఇచ్చారు. మళ్లీ తిరిగి 20వ తేదీన స్కూళ్లు తెరుచుకుంటున్నాయి.
అయితే, కొన్ని క్రిస్టియన్ మైనారిటీ స్కూళ్లు మాత్రం 17వ తేదీ రీఓపెనింగ్ అవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం కూడా సెలవు ఇవ్వడంతో వరుసగా సెలవులు పొడిగించి, తిరిగి సోమవారం స్కూళ్లు తెరుచుకోనున్నాయి. సంక్రాంతి పండుగ ఘనంగా జరుపుకుంటారు. మరోవైపు ఈరోజు నుంచి మహాకుంభమేళా కూడా ప్రారంభమైంది.