Lord Ganesh: ఏపని ప్రారంభించిన కూడా అది నిర్విఘ్నంగా జరగాలని చాలా మంది వినాయకుడిని పూజిస్తుంటారు. గణేషుడికి ఎర్రటి పూలు, గరక అంటే ఎంతో ప్రీతి అని చెబుతుంటారు. బెల్లం, ఉండ్రాళ్లను నైవేద్యంగా పెడుతుంటారు.
మనలో చాలా మందికి జీవితంలో అనేక రకాల సమస్యలు ఎదురౌతూనే ఉంటాయి. ఎంత కష్ట పడిన ఏదో ఒక అడ్డంకి వస్తునే ఉంటుంది. చేయాల్సిన పనులు చేయకుండా పనులు మధ్యలోనే ఆగిపోతుంటాయి.
దీంతో చాలా మంది ఆర్థిక సమస్యలలో కూరుకుపోతుంటారు. గణేషుడిని విఘ్నాలను తొలగిస్తాడంటారు. ఆయనను పూజించి ఏ పని స్టార్ట్ చేసిన కూడా మధ్యలో ఆగకుండా అది కంప్లీట్ అయిపోతుంది.
అలాంటి వినాయకుడికి సంకష్ట చతుర్థి అనే ఎంతో ప్రీతికరమైందని చెబుతుంటారు. ఈ పూజలను సాయంత్రం చంద్రోదయం సమయంలో చేస్తారు. ఈ వ్రతాన్ని ఆచరిస్తే లైఫ్ లో ఏ కోరికైన ఇట్టే నెరవేరుతుంది.
సంకష్ట హర వ్రతం చేసేవారు ముఖ్యంగా ఉదయం లేవాలి. ఆ రోజు ఉపవాసం ఉండాలి. సాయంత్ర పూట పీట తీసుకుని దానిపై ఎరుపురంగు వస్త్రం వేయాలి. దానిపై వినాయకుడి విగ్రహం లేదా పోకలో ఆ దేవుడిని ఆవాహన చేసుకొవాలి..
కొందరు తమల పాకుమీద ఎర్రటి కుంకుమతో చంద్రుడి ఆకారం గీస్తారు. ఆ తర్వాత పసుపుకుంకుమ, ఎర్రటి పూలు, గరకతో పూజించాలి. వినాయకుడి పూజలో తులసీనీ మాత్రం ఉపయోగించకూడదు..
దీనివెనుక పురాణ గాథ ఉంది. ఒకప్పుడు తులసీ వినాయకుడిని చూసి మోహించి, నన్ను పెళ్లిచేసుకొమ్మని అడుగుతుందంట. కానీ గణేషుడు పట్టించుకోడు. ఆ తర్వాత తులసీ వినాయకుడికి శాపం ఇస్తుందంట..
అప్పటి నుంచి తులసీని వినాయకుడి పూజలో అస్సలు ఉపయోగించరు. ఎర్రటి రంగు అంటే గణేషుడికి ఎంతో ఇష్టం. అందుకే ఎర్రటి పుష్పం, ఎర్రటి బట్ట, కుంకుమ, గణేషుడికి సమర్పించాలి. Disclaimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్నవి వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)