Sai Pallavi pressure: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సాయి పల్లవికి ఉన్న పేరు గురించి అందరికీ తెలిసిన విషయమే. తెలుగు ఇండస్ట్రీ నే కాదు.. ఇతర ఇండస్ట్రీలలో కూడా ఈమెకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఈ క్రమంలో ఈ హీరోయిన్ తన తల్లిదండ్రుల దగ్గర నుంచి ఒత్తిడి ఎదుర్కొంటోంది అని వినికిడి. ఇంతకీ ఎందుకంటే..?
హీరోయిన్ అంటేనే గ్లామర్ అనుకుంటున్నా ఈరోజుల్లో.. మేకప్ లేకుండా.. కేవలం నటనతో ఎంతోమంది అభిమానులను తెచ్చుకోవచ్చు అని రుజువు చేసుకుంది సాయి పల్లవి. సాయి పల్లవి సినిమా వస్తోందంటే.. హీరో, దర్శకుడితో సంబంధం లేకుండా తప్పకుండా ఆ సినిమా కథ బాగుంటుంది అని సినీ ప్రేక్షకులు నమ్మేలా చేసుకుంది.
ఇంతకీ పేరు తెచ్చుకున్న ఈ హీరోయిన్ ఈ మధ్యనే నాగచైతన్య తండేల్ చిత్రంతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. చందు మండేటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సాయి పల్లవి సూపర్ హిట్ సినిమాల లిస్టులో మరో సినిమాగా చేరింది.
ప్రస్తుతం బాలీవుడ్ లో రణబీర్ కపూర్ తో కలిసి త్వరలోనే భారీ బడ్జెట్ రామాయణంలో కూడా కనిపించనుంది. ఇలా అన్ని ఇండస్ట్రీలలో తనకంటూ మంచి పేరు తెచ్చుకున్న సాయి పల్లవి తన తల్లిదండ్రుల నుంచి కొంచెం ఒత్తిడి ఎదుర్కొంటుందట.
అసలు విషయానికి వస్తే సాయి పల్లవి చెల్లెళ్లకు ఈమధ్య పెళ్లయిన సంగతి తెలిసిందే. ఇక సాయి పల్లవి తానే దగ్గర ఉంది మరి చెల్లెలు పెళ్లి ఘనంగా చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఆమె అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి .
అయితే అక్క కన్నా ముందు చెల్లెళ్లకు పెళ్లి కావడంతో.. ఇప్పుడు సాయి పల్లవి ని కూడా త్వరగా పెళ్లి చేసుకోమని తన పారన్ అడుగుతున్నారనే వార్త వినిపిస్తోంది. ప్రస్తుతం సాయి పల్లవి చేతిలో ఎన్నో ఆఫర్లు ఉన్నాయి. కొన్ని ప్రముఖ వెబ్సైట్స్ కథనాల ప్రకారం.. సాయి పల్లవి అమ్మానాన్న మాత్రం ఇప్పుడు ఆమెని పెళ్లి చేసుకోమని అడుగుతున్నారని.. దీంతో ఒకపక్క సినిమాలు మరో పక్క పెళ్లి వల్ల సాయి పల్లవి ముందు దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలి అని ఇబ్బంది పడుతోందని తెలుస్తోంది. అయితే చాలా సందర్భాల్లో సాయి పల్లవి తన తల్లి తండ్రులు తనని ఎంతగానో ఎంకరేజ్ చేస్తారని చెప్పిన విషయం తెలిసిందే. కాబట్టి ప్రస్తుతం వస్తున్న రూమర్స్ లో నిజా నిజాలు తెలియాల్సి ఉంది.