Realme Valentine’s Day Sale 2025: రియల్‌మీ మొబైల్స్ వాలెంటైన్స్ డే 2025 సందర్భంగా అతి తక్కువ ధరకే లభిస్తున్నాయి. మొబైల్ కొనుగోలు చేసేందుకు ఇదే మంచి సమయం.. అన్ని మొబైల్స్‌పై దాదాపు రూ.2 వేల వరకు డిస్కౌంట్ అందుబాటులో ఉంది.
Realme Valentine’s Day Sale 2025: వాలెంటైన్స్ డే 2025 సందర్భంగా మీ ప్రియమైన వారికి గిఫ్ట్స్ ఇవ్వాలనుకుంటున్నారా? అది కూడా మంచి స్మార్ట్‌ఫోన్‌ని.. ఇదే అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ రియల్‌మీ అద్భుతమైన గుడ్‌న్యూస్ తెలిపింది. వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రత్యేకమైన సేల్‌ను పరిచయం చేసింది. ఈ సేల్‌లో భాగంగా కొన్ని రకాల స్మార్ట్‌ఫోన్స్ డెడ్ చీప్ ధరలకే లభిస్తున్నాయి. అంతేకాకుండా వాటిపై అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.
వాలెంటైన్స్ డే 2025 సందర్భంగా రియల్‌మీ అందిస్తున్న ప్రత్యేకమైన సేల్‌లో కొన్ని మొబైల్స్ అత్యధిక తగ్గింపు ధరకే లభిస్తోంది. ఈ సేల్‌ను రియల్ మీ ఫిబ్రవరి 6 నుంచి ప్రారంభించగా.. ఫిబ్రవరి 14వ తేదిన ముగుస్తుంది. ఇప్పటికే అధికారిక వెబ్‌సైట్‌లో ఈ సేల్ అందుబాటులో ఉంది.
ఈ ఆఫర్స్‌ను రియల్‌మీ కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్, ఇతర రిటైల్ స్టోర్‌లలో కూడా అందిస్తోంది. గతంలో మార్కట్‌లోకి లాంచ్ అయిన Realme GT 6T స్మార్ట్‌ఫోన్ ధర రూ.32,999 కాగా.. ఆఫర్స్‌లో భాగంగా కేవలం రూ.25,999కే లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా రూ.4,000 వరకు ప్రత్యేకమైన డిస్కౌంట్‌ను కూడా అందిస్తోంది.
ఈ Realme GT 6T స్మార్ట్‌ఫోన్‌పై ప్రత్యేమైన వాలెంటైన్స్ డే 2025 రూ.3,000 కూపన్ డిస్కౌంట్ కూడా లభిస్తోంది. దీంతో పాటు ఇది మార్కెట్‌లోకి శక్తివంతమైన ఫీచర్స్‌తో పాటు అద్బుతమైన డిస్ల్పే సెటప్‌ను కూడా అందిస్తోంది. దీంతో పాటు శక్తివంతమైన ప్రాసెసర్‌ను కూడా అందిస్తోంది.
వాలెంటైన్స్ డే ఆఫర్స్‌లో భాగంగా Realme Narzo 70 Turbo 5G స్మార్ట్‌ఫోన్ కూడా భారీ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. మార్కెట్‌లో 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి స్మార్ట్‌ఫోన్ రూ16,999 కాగా.. స్పెషల్ ఆఫర్స్‌లో భాగంగా కేవలం రూ.13,999 అందిస్తోంది. అంతేకాకుండా ఇతర డిస్కౌంట్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.
వాలెంటైన్స్ డే సందర్భంగా Realme GT 7 Pro స్మార్ట్‌ఫోన్‌పై కూడా అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్ లభిస్తోంది. మార్కెట్‌లో 12GB ర్యామ్, 256GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ కలిగిన స్మార్ట్‌ఫోన్ ధర రూ.59,999 కాగా.. స్పెషల్ ఆఫర్స్‌తో కేవలం రూ.54,999కే అందుబాటులో ఉంది. అలాగే అన్ని స్మార్ట్‌వాచ్‌లపై దాదాపు 30 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తోంది.