Ram Charan Career Disaster Movies: రామ్ చరణ్ .. తండ్రి చిరంజీవి నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన కెరీర్లో బ్లాక్ బస్టర్ మూవీస్ కాకుండా.. డిజాస్టర్ మూవీస్ కూడా ఉన్నాయి. అవేంటో మీరు ఓ లుక్కేయండి..
ఆచార్య (Acharya): రామ్ చరణ్.. తన తండ్రి మెగాస్టార్ చిరంజీవితో కలిసి పూర్తి స్థాయిలో కలిసి నటించిన సినిమా 'ఆచార్య'. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్ట్ర్గా నిలిచింది.
వినయ విధేయ రామ (Vinaya Vidheya Rama): బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా.. కియారా అద్వానీ హీరోయిన్గా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది.
బ్రూస్లీ (Bruce Lee): శ్రీను వైట్ల దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన మూవీ 'బ్రూస్లీ'. ఈ సినిమాలో చిరంజీవి అతిథి పాత్రలో నటించిన బాక్సాఫీస్ దగ్గర దారుణమైన ఫలితాన్ని అందుకుంది.
గోవిందుడు అందరివాడేలే (Govindudu Andarivaadele): కృష్ణవంశీ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన 'గోవిందుడు అందరివాడేలే' సినిమా బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితం అందుకోలేదు.
జంజీర్ (తుఫాను) (Zanjeer - Thufan): అప్పట్లో అమితాబ్ బచ్చన్ హీరోగా నటించిన 'జంజీర్' మూవీని అదే టైటిల్‌తో హిందీలో రీమేక్ చేసాడు రామ్ చరణ్. కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా విఫలమైంది. ఈ సినిమాను తెలుగులో 'తుఫాను'పేరు డబ్ చేసి రిలీజ్ చేసారు.
ఆరెంజ్ (Orange): బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నాగబాబు నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని మూట గట్టుకుంది.