Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana : డబ్బు ఉన్నవారు ఏ పాలసీ అయినా తీసుకుంటారు. కానీ పేద, మధ్యతరగతికి చెందిన వారు బతుకుబండిని లాగేందుకు ఎంతగానో శ్రమిస్తుంటారు. వారికోసమే ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఓ అద్భుతమైన ఇన్సూరెన్స్ ప్లాన్‌ను తీసుకొచ్చింది.
Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana : డబ్బు ఉన్నవారు ఏ పాలసీ అయినా తీసుకుంటారు. కానీ పేద, మధ్యతరగతికి చెందిన వారు బతుకుబండిని లాగేందుకు ఎంతగానో శ్రమిస్తుంటారు. వారికోసమే ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఓ అద్భుతమైన ఇన్సూరెన్స్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. Also Read: Post Office ఖాతాదారులకు షాక్..ఇలా చేయకపోతే ఎకౌంట్ క్లోజ్
(India Post) ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్.. పీఎన్బీ మెట్‌లైఫ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ సహకారంతో పేద, మధ్య తరగతి వారి కోసం ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana) స్కీమ్ ప్రవేశపెట్టింది.
ప్రతి ఏడాది రూ.330 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. దీని ద్వారా రూ.2 లక్షల రూపాయల లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజీ మీకు లభిస్తుంది. సేవింగ్ అకౌంట్ ఉన్న ఖాతాదారులకు ఇండియా పోస్ట్ (India Post) అందిస్తున్న ఈ ప్లాన్ అందుబాటులో ఉంటుంది. Also Read: SBI Cuts Interest Rates: ఎస్బీఐ కస్టమర్లకు శుభవార్త.. ఆ లోన్స్‌పై భారీగా తగ్గిన వడ్డీ రేట్లు
వాస్తవానికి ఇది ఒక టర్మ్ పాలసీ. ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY) కింద టర్మ్ పాలసీ తీసుకోవాలంటే కనీస వయసు 18 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ట వయసు 50ఏళ్లకు మించరాదు. వీరు ప్రతి ఏడాది రూ.330 లైఫ్ ఇన్సూరెన్స్ కోసం చెల్లించాల్సి ఉంటుంది.
ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకం టర్మ్ ప్లాన్ మెచ్యురిటీ గడువు 55 ఏళ్ల వయసులో ముగుస్తుంది. ఇన్సూరెన్స్ చేస్తున్న సమస్యంలో టర్మ్ మధ్యలోనే ఆ ఖాతాదారుడు చనిపోతే రూ.2 లక్షల నగదు నామినీకి అందజేస్తారు. అందుకోసం నామినీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
55 ఏళ్ల వయసులో మెచ్యూరిటీ గడువు ముగిసిన తర్వాత పాలసీదారులకు ఏ బెనిఫిట్స్ అందవు. కానీ మెచ్యూరిటీ గడువు ముగిసేవరకు ప్రమాదవశాత్తూ వారు మరణిస్తే నామినీకి, అంటే పాలసీదారుల కుటుంబానికి రూ.2 లక్షల మేర ఆర్థిక తోడ్పాడు అందించడమే ఈ స్కీమ్ ఉద్దేశం. ఈ పథకానికి సంబంధించిన అన్ని వివరాలను వివరంగా తెలుసుకోవడానికి 1800 180 1111 టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేయవచ్చు. Also Read: EPFO: పీఎఫ్ ఖాతాలో వడ్డీ ఎప్పుడు జమకానుందో తెలుసా?