Maha kumbh mela 2025: దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ప్రయాగ్ రాజ్ చేరుకున్నారు. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. మోదీ వెంట యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు.
ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో మహాకుంభమేళ ఎంతో వైభవంగా జరుగుతుంది. 144 ఏళ్ల తర్వాత ఏర్పడిన మహా కుంభమేళలో పవిత్ర స్నానాలు ఆచరించేందుకు భక్తులు పొటెత్తారు. జన్వరి 13న ప్రారంభమైన కుంభమేళ, ఫిబ్రవరి 26 వరకు కొనసాగనుంది.
ఇదిలా ఉండగా.. కుంభమేళలో ఇప్పటి దేశ, విదేశాల నుంచి భారీగా భక్తులు పుణ్యస్నానాలకు తరలివస్తున్నారు. అంతే కాకుండా..ఇటీవల భూటాన్ రాజు సైతం త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు.
తాజాగా.. దేశ ప్రధాని మోదీ ప్రయాగ్ రాజ్ కు చేరుకున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్.. మోదీకి ప్రత్యేకంగా ఆహ్వానం పలికారు. ముందుగా పీఎం మోదీ, యోగితో కలిసి అరైల్ ఘాట్ కు చేరుకున్నారు. అక్కడ నుంచి బోట్ లో త్రివేణి సంగమం చేరుకున్నారు.
ఈరోజు భీష్మాష్టమి కూడా కావడంతో భక్తులు పుణ్యస్నానాలకు పొటెత్తారు. మోదీ 11. 15 నిముషాలకు పవిత్ర స్నానం ఆచరించారు. అయితే.. 144 ఏళ్ల తర్వాత ఏర్పడిన కుంభమేళలో స్నానం ఆచరించిన ప్రధానిగా మోదీ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు.
మోదీ త్రివేణి సంగమంలో స్నానం ఆచరించి, సూర్యుడికి అర్ఘ్యం వదిలారు. అదే విధంగా ప్రత్యేకంగా సూర్యుడికి నమస్కారం చేసుకున్నారు. గంగా, యమున, సరస్వతి త్రివేణి సంగమం వద్ద స్నానం చేసేందుకు భక్తులు ఎంతో ఆసక్తి కనబరుస్తుంటారు.
ఇంకా రెండు షాహి స్నానాలు మిగిలి ఉన్నాయి. ఫిబ్రవరి 12 మాఘ పౌర్ణమి, ఫిబ్రవరి 26 మహా శివరాత్రి. అయితే.. భక్తులు మరింతగా ఎక్కువ సంఖ్యలో వచ్చేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు. కుంభమేళలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా యోగి సర్కారు అధికారులతో నిరంతరం ఆదేశాలు జారీ చేస్తున్నారు.