PM Kisan: జనవరి 31లోగా ఈ పని పూర్తి చేయండి.. లేకపోతే 19వ విడత కిసాన్‌ డబ్బులు పొందలేరు..

Pm Kisan 19th Installment: పిఎం కిసాన్ (PM Kisan) యోజన కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ప్రారంభించిన ఈ పథకం ద్వారా వారికి ఆర్థిక చేయుత అందిస్తుంది. రైతుల వ్యవసాయానికి పెట్టుబడికి ఇది ఆర్థిక సాయం అందిస్తుంది. ఈ పథకాన్ని 2019లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది.. దేశవ్యాప్తంగా ఉన్న కొన్ని కోట్ల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. అయితే జనవరి 31 లోగా ఈ పని పూర్తి చేయండి. లేకపోతే 19 విడత డబ్బులు రావు.
 

1 /5

ఇప్పటి వరకు పీఎం కిసాన్ యోజన ద్వారా 18వ విడత డబ్బులు అందజేశారు. ఇది అక్టోబర్ 5వ తేదీన డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్ (DBT)  ద్వారా క్రెడిట్ చేశారు. ఇప్పుడు రైతులంతా 19వ విడత కిసాన్ యోజన డబ్బుల కోసం ఎదురుచూస్తున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలోనే కిసాన్ యోజన నిధులు విడుదల అయ్యే అవకాశం ఉంది.  

2 /5

అయితే ప్రధానమంత్రి కిసాన్ యోజన ద్వారా రైతులు లబ్ది పొందే రైతులు కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి.  పీఎం కిసాన్ యోజన పథకానికి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. జనవరి 31 లోగా ఈ పని పూర్తి చేయండి.   

3 /5

ఇక పీఎం కిసాన్‌ యోజన ద్వారా స్టేటస్ చెక్ చేసుకునే సదుపాయం కూడా ఉంది. లబ్ధిదారులు pmkisan.gov.in ద్వారా నేరుగా చెక్ చేసుకోవచ్చు. బెనిఫిషియరీ స్టేటస్ పై క్లిక్ చేసి మీరు అక్కడ ఆధార్ నెంబర్, బ్యాంక్ ఖాతా, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత 'డేటా' బటన్ పై క్లిక్ చేస్తే మీకు స్క్రీన్ పై మీ ఇన్స్టాల్మెంట్ స్టేటస్ కనిపిస్తుంది. ఈ విధంగా రైతులు బెనిఫిషియరీ స్టేటస్ లో సులభంగా చెక్ చేసుకోవచ్చు.

4 /5

ఇక ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పొందడానికి కేవైసీ ప్రక్రియ ముందుగానే పూర్తి చేసి ఉండాలి. అధికారిక వెబ్సైట్లో లేదా కామన్‌ సర్వీస్‌ సెంటర్‌ (CSC) సందర్శించడం ద్వారా సులభంగా ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. దీనికి బ్యాంక్ ఖాతాకు, ఆధార్ నెంబర్ కూడా లింక్ చేయాల్సి ఉంటుంది.  

5 /5

 మీ భూమి వివరాలు కూడా ఉండాలి. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా క్రెడిట్ అవుతాయి.. కాబట్టి అన్ని రికార్డులు మీ వద్ద కలిగి ఉండాలి. ఫిబ్రవరి బడ్జెట్‌లో పీఎం కిసాన్‌ డబ్బులు రూ.10 వేలకు సాయం పెంచుతారని రైతులు ఎదురు చూస్తున్నారు. ఇదే జరిగితే ఇక ఏటా రూ.6000 బదులుగా రూ.10 వేల సాయం రైతులు అందుకుంటారు.