EPFO Big Update: మరి కొద్దిరోజుల్లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో కీలకమైన ప్రకటనలు వెలువడనున్నాయి. ముఖ్యంగా ఈపీఎఫ్ ఖాతాదారులకు ప్రయోజనం కలగనుంది. కనీన పెన్షన్ పెరగవచ్చు.
ఈపీఎఫ్ఓ సభ్యులకు పెన్షన్ అందించేందుకు ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ 1995లో ప్రారంభమైంది. కనీస పెన్షన్ 1000 రూపాయల్నించి 5000 రూపాయలకు పెంచాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. కానీ 7500 రూపాయలకు పెంచాలని కార్మికులు కోరుతున్నారు.
ఈపీఎఫ్‌లో రెండు రకాల ఖాతాలుంటాయి. పదవీ విరమణ చేసినప్పుడు ఒకేసారి విత్‌డ్రా చేయడం, రెండోది నెలలవారీ పెన్షన్. యజమాని నుంచి అందే 12 శాతంతో 8.33 శాతం పెన్షన్ ఉంటుంది. ఉద్యోగుల జీతం నుంచి ప్రతి నెలా 12 శాతం పీఎఫ్ ఖాతాకు చేరుతుంది. ఇందులో 3.67 శాతం పెన్షన్ స్కీమ్‌కు జమ అవుతుంది.
ఇక ప్రైవేట్ రంగ ఉద్యోగుల అభ్యర్ధనను సైతం కేంద్ర ప్రభుత్వం పరిశీలించే అవకాశముంది. లక్షలాది మంది ప్రైవేట్ రంగ సిబ్బందికి ప్రయోజనం కలగవచ్చు. కనీస పెన్షన్‌ను 5 వేలు చేయాలని కార్మిక సంఘాలు సూచించాయి.
ఈపీఎస్ ఉద్యోగులు జనవరి 10వ తేదీన కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అయ్యారు. ఈపీఎఫ్ఓ కనీస పెన్షన్ పెంపు, డీఏ పెంపు, 8వ వేతన సంఘం ఏర్పాటు, పెన్షనర్ల భార్యలకు ఉచిత వైద్యం అందించాలనేది ప్రతిపాదనలో ఉన్నాయి. వీటిలో 8వ వేతన సంఘం ఏర్పాటుకు ఆమోదం లభించింది.
2014లో ఈపీఎఫ్ కనీస పెన్షన్ 1000 రూపాయలు ఉంది. అయితే ఇప్పటికీ 36 లక్షలమంది పెన్షనర్లు ఇంకా తక్కువ పెన్షన్ పొందుతున్నారు.
ఈపీఎఫ్ఓ పెన్షన్ పధకానికి సంబంధించి కనీస ఈపీఎస్ పెన్షన్ 1000 రూపాయల్నించి 7500 రూపాయలకు పెంచాలని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ డిమాండ్ చేశారు.
కేంద్ర బడ్జెట్ ఫిబ్రవరి 1న రానుంది. ఈ బడ్జెట్‌పై అన్నదాతలు, కార్మికులు, యువతతో పాటు ఉద్యోగులు పెద్దఎత్తున ఆశలు పెట్టుకున్నారు. అన్ని శాఖల ఉద్యోగులు ప్రతిపాదించినట్టే ఈపీఎఫ్ఓ నుంచి కూడా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.