Nara brahmani: మా నాన్న నిజస్వరూపం ఇప్పుడే అర్థమైంది.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నారా బ్రాహ్మాణి.. స్టోరీ ఏంటంటే..?

Nandamuri Balakrishna: నారా బ్రాహ్మణి ఇటీవల తన తండ్రిపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారాయి. దీనిపై బాలయ్య అభిమానులు ఎమోషన్ కు గురౌతున్నారు.

1 /6

హిందు పురం ఎమ్మెల్యే, నందమూరి బాలకృష్ణకు ఇటీవల కేంద్రం పద్మభూషణ్ తో సత్కరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దీనిపై నందమూరీ అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. బాలయ్యకు ఇది తగిన గౌరవమని కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.

2 /6

పద్మభూషణ్ పురస్కారం అందుకున్న నందమూరి బాలకృష్ణను సినిమా, రాజకీయరంగాలకు చెందిన ప్రముఖులు ప్రత్యేకంగా అభినందించారు. ఇదిలా ఉండగా.. పద్మభూషణ్ పురస్కారం తర్వాత బాలయ్య బాబు కోసం ఆయన సోదరి నారా భువనేశ్వరీ  ఒక పార్టీని ఏర్పాటు చేశారు.

3 /6

ఈ పార్టీలో అనేక మంది సినిమా, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు హజరయ్యారు. ఈ సమావేశంలో బాలయ్య కుటుంబ సభ్యులు అందరు ఆయన గురించి తమ మనస్సులోని మాటలను అందరితో పంచుకున్నారు.  

4 /6

నారా బ్రాహ్మాణి తన తండ్రిపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. తన తండ్రిని చిన్న తనంలో.. నేను, నా సోదరి తేజశ్వి లు అనేక సందర్భాలలో తప్పుగా అర్థం చేసుకున్నామని సభలోనే నారా బ్రాహ్మణి చెప్పేసింది.

5 /6

మా తండ్రి ఏది ఉన్న సూటీగా, కుండ బద్దలు కొట్టేసినట్లు మాట్లాడేస్తుంటారు. దీని వల్ల చిన్నతనంలో ఇలా ఎందుకు మాట్లాడుతారని అనుకునే వాళ్లమని చెప్పింది. కానీ తన తండ్రి మనస్సులో ఎలాంటి కల్మషం ఉండదని కూడా నారా బ్రాహ్మణి స్పష్టం చేసింది. ఆయన ఎదటివారి మంచి కోసమే నిరంతరం తపిస్తారని చెప్పింది.  

6 /6

అదే విధంగా బాలయ్య బాబు చిన్న కూతురు తేజశ్వీ తన తండ్రి గ్రాఫ్ పెరగడానికి తానే అసలు బ్యాక్ బోన్ అని సమావేశంలో చెప్పింది. దీంతో ప్రస్తుతం బాలయ్య ఇద్దరు కూతుళ్లు చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారాయి. మరీ తేజశ్వీ ఫన్నీగా అనిందో మరేంటో కానీ.. బాలయ్య అభిమానులు మాత్రం తేజశ్వీ తమ అభిమాన హీరో బ్యాక్ బోన్ అంటూ పండగ చేసుకుంటున్నారంట.