New Profitable Small Business Idea: లేటెస్ట్ బిజినెస్‌ ఐడియా.. రోజుకు 10 గంటలు పని చేస్తే నెలకు రూ. 1,00,000 ఆదాయం..

Yoga Studio Business Idea: నేటి కాలంలో చిన్న ఆలోచనలతో కూడా అనేక వ్యాపారాలు ప్రారంభించవచ్చు. బిజినెస్‌ చేయడానికి అధికపెట్టుబడి అవసరం లేదు. చిన్న పెట్టుబడితో అధిక లాభాలు పొందవచ్చని నేటి చిన్న వ్యాపారాలు నిరూపిస్తున్నాయి. అనేక మంది వ్యక్తులు తక్కువ పెట్టుబడితో విజయవంతమైన వ్యాపారాలను ప్రారంభించి, మంచి లాభాలు పొందుతున్నారు. మీరు కూడా ఈ బాటలో నడవాలని అనుకుంటున్నారా? ఈరోజు మీరు తెలుసుకొనే వ్యాపారం ఎంతో ప్రత్యేకమైనది, లాభదాయకం కూడా. ఎలా ప్రారంభించాలి అనే వివరాలు తెలుసుకుందాం. 

1 /12

ప్రస్తుత కాలంలో చాలా మంది చిన్న చిన్న బిజినెస్‌లు ప్రారంభించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇంటి నుండి కూడా కొన్ని రకాల బిజినెస్‌లు విజయవంతంగా నిర్వహిస్తున్నారు.

2 /12

చాలామంది ఇప్పుడు చిన్న తరహా వ్యాపారాల వైపు మొగ్గు చూపుతున్నారు. పెద్ద పెట్టుబడులు, భారీ ఆలోచనలు లేకుండానే, తమ చుట్టూ ఉన్న సమస్యలను అవకాశాలుగా మలుచుకుని వినూత్నంగా ఆలోచిస్తున్నారు.

3 /12

అందులో యోగా స్టూడియో ఒకటి. యోగా అనేది ఒక ప్రాచీన భారతీయ వ్యాయామ పద్ధతి. ఇది శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. యోగాలో వివిధ రకాల భంగిమలు, శ్వాస వ్యాయామాలు, ధ్యానం ఉంటాయి.  

4 /12

నేటి కాలంలో యోగా చేయడం చాలా అవసరం. ఎందుకంటే మన జీవనశైలిలో అనేక మార్పులు వచ్చాయి. ఈ మార్పుల కారణంగా మన శరీరం, మనస్సుపై ఒత్తిడి పెరుగుతోంది. యోగా చేయడం వల్ల ఈ ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.

5 /12

కాబట్టి ఈ అవకాశంతో కూడా మీరు చిన్న లేదా పెద్ద యోగా స్టూడియోను ప్రారంభించవచ్చు. మీరు వ్యాపారం చేయడంతో పాటు సమాజానికి కూడా ఉపయోగపడవచ్చు. చాలా మంది వ్యాపారవేత్తలు లాభంతో పాటు సామాజిక బాధ్యతను కూడా నెరవేరుస్తున్నారు.  

6 /12

యోగా వ్యాపారాన్ని ప్రారంభించడానికి ముందు, మీకు యోగాలో మంచి నైపుణ్యం ఉండాలి. మీరు యోగా గురువుగా లేదా శిక్షకుడిగా అర్హత పొందాలి. మీరు ఏ రకమైన యోగా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటున్నారో నిర్ణయించుకోండి.

7 /12

మీరు యోగా స్టూడియోను తెరవాలనుకుంటున్నారా లేదా ఆన్‌లైన్‌లో యోగా తరగతులు అందించాలనుకుంటున్నారా? అనేది ముఖ్యం. దీంతో పాటు మీ వ్యాపార ప్రణాళికలో మీ లక్ష్యాలు, వ్యూహాలు, ఆర్థిక అంచనాలు ఉండాలి.

8 /12

మీరు యోగా స్టూడియోను తెరవాలనుకుంటే సరైన స్థలాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం. మీ స్టూడియో ప్రజలకు అందుబాటులో ఉండాలి అలాగే తగినంత స్థలం కలిగి ఉండాలి.

9 /12

 మీరు చిన్న పెట్టుబడితో కూడా యోగా వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. మీకు ఆర్థిక సహాయం అవసరమైతే, మీరు బ్యాంకులు లేదా ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు పొందవచ్చు.  

10 /12

యోగా వ్యాపారాన్ని విజయవంతం చేయడానికి సమయం పడుతుంది. ఓపికగా ఉండండి, మీ కృషిని కొనసాగించండి. యోగా రంగంలో వస్తున్న కొత్త పోకడలను గురించి తెలుసుకోండి. మీ స్టూడియోలో వాటిని అందించడానికి ప్రయత్నించండి.

11 /12

యోగా స్టూడియో ప్రారంభించడం కోసం మీరు రూ. 5 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ వ్యాపారంతో మీరు నెలకు రూ. 20,000 నుంచి రూ. 50,000 సంపాదించవచ్చు.   

12 /12

యోగా బిజినెస్‌ ఐడియా మీకు కూడా నచ్చుతే వెంటనే ప్రారంభించండి. అయితే ఏ రకమైన బిజినెస్‌ అయిన కృషి, ఓపిక పైన నడుస్తుంది.. కాబట్టి మార్కెట్‌కు అనుగుణంగా మీ వ్యాపారాన్ని నడపండి.