Tirupati: రథసప్తమి.. సూర్యప్రభ వాహనంపై శ్రీ కోదండరామస్వామి కటాక్షం..

Tirupati Ratha Saptami Photos: తిరుపతిలో రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురువారం 4వ తేదీ రథసప్తమి సందర్భంగా తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆ ఫోటోలు చూద్దాం.
 

1 /5

ఫిబ్రవరి 4 తేదీ రథ సప్తమి సందర్భంగా స్వామివారికి ఉదయం తోమాల, కొలువు, సహస్రనామార్చన నిర్వహించారు. ఆ తర్వాత స్వామివారిని సూర్యప్రభవాహనంపై మాడ వీధుల్లో భక్తులను కటాక్షించారు.  

2 /5

రాత్రి స్వామివారు చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనం ఇచ్చారు. డిప్యూటీ ఈఓ నాగరత్న తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులకు అన్నీ ఏర్పాట్లు చేశారు. స్వామివారిని చూసి భక్తులు తరించిపోయారు.  

3 /5

ఇక తిరుచానూరు పద్మావతి ఆలయంలోని శ్రీసూర్యనారాయణ స్వామివారు అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అంతేకాదు నృత్య కళాకారులు తన నృత్యాలతో అలంకరించారు.  

4 /5

సూర్యప్రభ వాహనంపై అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు. నిత్యం స్వామివారి దర్శనం కోసం తపించిపోయే భక్తులకు రథసప్తమి సందర్భంగా భక్తులకు దర్శనం ఇచ్చారు.   

5 /5

తిరుమల శ్రీవేంకటేశుని దర్శనం కోసం నిత్యం వేల మంది భక్తులు వేచి చూస్తారు. తిరుమల వెళ్లిన భక్తులు తిరుచానూరు, గోవింద స్వామివారిని కూడా దర్శించుకోవడం ఆనవాయితీ.