Vayve Eva Solar Ev: రూ.3.25 లక్షలకే.. 175 కి.మీ మైలేజీనిచ్చే సోలార్ కారు.. ఫీచర్స్‌తో పిచ్చెక్కిస్తోంది!

Vayve Eva Solar Powered Electric Car Price: రూ.3.25 లక్షలకే భారత మార్కెట్‌లో సోలార్‌ కారు లాంచ్‌ అయ్యింది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో కస్టమర్స్‌కి లభించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Vayve Eva Solar Powered Electric Car: భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో భాగంగా కొత్త కొత్త కార్లు విడుదలైనవి.. ఇందులో చాలా వరకు బడ్జెట్‌ ధరల్లో లభించే కార్లే ఉండడం విశేషం. అయితే పూణేకు చెందిన స్టార్టప్ ఆటో మొబైల్‌ కంపెనీ ఈ ఎక్స్‌పోలో ఓ ప్రత్యేకమైన కారును విడుదల చేసిన సంగతి తెలిసిందే.. Vayve మొబిలిటీ కంపెనీ భారత్‌లో మొట్టమొదటి సోలార్‌ కారును అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ వినూత్న కారుకు సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

1 /5

భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో లాంచ్‌ అయిన Vayve Eva సోలార్ కారు అద్భుతమైన బ్యాటరీతో అందుబాటులోకి రాబోతోంది. ఇది 9 kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే దీనిని ఒకే ఒక సారి ఛార్జ్‌ చేస్తే దాదాపు 125 కిలోమీటర్ల వరకు మైలేజీని అందిస్తుంది.  

2 /5

ఇక ఈ కారు మొత్తం మూడు వేరియంట్స్‌లో అందుబాటులోకి వచ్చింది. ఇందులోని బేస్‌ వేరియంట్‌ 125 కిలోమీటర్ల మైలేజీని అందిస్తే.. 14 kWh బ్యాటరీ ప్యాక్‌తో విడుదలైన రెండవ వేరియంట్‌ 175 కిలోమీటర్ల వరకు మైలేజీని అందిస్తుంది. ఇక మూడవ వేరియంట్‌ 250 కిలోమీటర్ల వరకు మైలేజీని అందిస్తుందని కంపెనీ వెల్లడించింది.   

3 /5

అలాగే ఈ Vayve Mobility Eva కారుకు వచ్చే ప్రత్యేకమైన సోలార్ రూఫ్ ప్యానెల్ ప్రతి రోజూ ఛార్జ్‌ అవుతూ.. దాదాపు 10 కిలోమీటర్ల వరకు అదనపు మైలేజీని అందిస్తుందని సమాచారం. ఇక దీని గరిష్ట వేగం గంటకు 70 కి.మీ  వరకు వెళ్తుందట. అంతేకాకుండా ఇది ప్రత్యేకమైన సెఫ్టీ ఫీచర్స్‌ను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది.  

4 /5

ఇక ఈ Vayve Eva సోలార్ కారు ఫీచర్స్‌ వివరాల్లోకి వెళితే.. ఈ కారు ప్రత్యేకమైన డిజైన్‌తో విడుదలైంది. అలాగే స్పెషల్ DRL లైట్స్‌ కూడా లభిస్తున్నాయి. దీంతో పాటు ఇందులో ప్రత్యేకమైన టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కూడా లభిస్తోంది. అలాగే స్పెషల్ Apple CarPlayతో పాటు Android Auto సపోర్ట్‌ ఫీచర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి.  

5 /5

ఇక ఇతర ఫీచర్స్‌ వివరాల్లోకి వెళితే..ఈ Vayve Eva కారులో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో పాటు రెండు-స్పోక్ స్టీరింగ్ వీల్స్‌ను కూడా అందిస్తోంది. ఈ సోలార్‌ కారు ధర వివరాల్లోకి వెళితే, దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.3.25 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. అలాగే ఇప్పటికే దీని బుకింగ్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది.