Meena Second Marriage: తన కన్నా 7 ఏళ్ల చిన్నవాడైన స్టార్‌ హీరోతో మీనా పెళ్లి?

Meena Second Marriage With Star Hero Rumours Goes Viral:: భర్త మరణంతో కుమార్తెతో ఉంటున్న సీనియర్‌ హీరోయిన్‌ మీనా రెండో పెళ్లికి సిద్ధమయ్యారనే వార్త సంచలనంగా మారింది. తనకంటే ఏడేళ్లు వయసు తక్కువ ఉన్న స్టార్‌ హీరోను పెళ్లి చేసుకున్నారనే పుకార్లు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి.

1 /8

చిత్ర పరిశ్రమలో హీరోయిన్‌గా‌ మీనా ఒక వెలుగు వెలిగారు. కన్నడ సినిమాతో తెరంగేట్రం చేసిన ఆమె వందకు పైగా సినిమాల్లో నటించినట్లు తెలుస్తోంది.

2 /8

కన్నడ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ వంటి వివిధ భాషల్లో హీరోయిన్‌గా మీనా నటించారు.

3 /8

బాల నటిగా కెరీర్‌ ప్రారంభించిన మీనా తర్వాత హీరోయిన్‌గా.. అనంతరం రీఎంట్రీలో పిల్లలకు తల్లి పాత్రల్లో నటిస్తున్నారు.

4 /8

బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ విద్యాసాగర్‌ను 2009లో వివాహం చేసుకున్న మీనా నైనిక అనే కుమార్తెకు జన్మనిచ్చింది. ఆమె భర్త విద్యాసాగర్ 2022లో అకాల మృతి చెందారు.

5 /8

భర్త మృతి నుంచి కోలుకున్న మీనా సినీ పరిశ్రమలోకి రీఎంట్రీ ఇచ్చారు. ఆ బాధ నుంచి పూర్తిగా బయటపడిన మీనా తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

6 /8

కుమార్తె కోసం రెండో వివాహం చేసుకోవాలనే నిర్ణయానికి మీనా వచ్చినట్లు పుకార్లు వస్తున్నాయి. ఆమె సన్నిహితులు, కుటుంబీకులు కూడా ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. 

7 /8

అందరి అభిప్రాయం మేరకు మీనా రెండో పెళ్లికి సిద్ధమయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆమె చేసుకోబోయే వ్యక్తి స్టార్‌ హీరో అని ప్రచారం జరుగుతోంది.

8 /8

ఆ స్టార్‌కు మీనాకు ఏడేళ్ల వయసు వ్యత్యాసం ఉందని టాక్‌ వినిపిస్తోంది. మీనాకు 48 ఏళ్ల వయసు కాగా.. ఆ స్టార్‌ హీరోకు 41 ఏళ్లు ఉన్నాయంట. ఈ వార్త సినీ పరిశ్రమలో చక్కర్లు కొడుతోంది. ఏడేళ్ల చిన్నవాడిని మీనా పెళ్లి చేసుకుంటారనే వార్త హల్‌చల్‌ చేస్తుండగా.. అది ఒట్టి పుకారేనని.. అలాంటిదేమీ లేదని మీనా సన్నిహితులు కొట్టి పారేస్తున్నారు. అయితే ఆ హీరో ఎవరనేది తెలియరాలేదు.