7th Pay Commission: ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్, గ్రాట్యూటీ కట్.. కొత్త రూల్స్ తెలుసా..!

Central Government Employees Pension Rules: కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్‌, గ్రాట్యూటీకి సంబంధించి ఇటీవల మోదీ సర్కారు జారీ చేసిన ఉత్తర్వులతో కొత్త ఆందోళన మొదలైంది. కొత్త నిబంధనల ప్రకారం.. ప్రభుత్వ ఉద్యోగులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే పెన్షన్‌, గ్రాట్యుటీ ప్రయోజనాలను కోల్పోవాల్సి ఉంటుంది. చిన్న తప్పు చేయకుండా ఉద్యోగులు జాగ్రత్తగా విధులు నిర్వహించాల్సి ఉంటుంది. 
 

1 /9

7వ వేతన సంఘం అమలుతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు భారీస్థాయిలో పెరిగాయి. పెన్షనర్లకు కూడా పెన్షన్‌ బాగా పెరిగింది. ఇక ఉద్యోగులకు జీతం ఎంత ముఖ్యమో.. గ్రాట్యూటీ కూడా అంతే ఇంపార్టెంట్‌గా భావిస్తారు.  

2 /9

అయితే ప్రభుత్వం ప్రకటించిన కొత్త నిబంధనతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఉద్యోగులు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే పెన్షన్, గ్రాట్యుటీ ప్రయోజనాలను కోల్పోతారని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.  

3 /9

ఈ ఉత్తర్వుల ప్రకారం.. ఒక ఉద్యోగి విధుల్లో తీవ్ర నేరాలకు పాల్పడినట్లు తేలితే.. ఈ ప్రయోజనాలు అందుకోలేడు.  

4 /9

త్వరలో 8వ వేతన సంఘం ఏర్పాటు కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు ఈ నిబంధనతో కఠిన హెచ్చరిక జారీ చేసినట్లు అయింది.   

5 /9

త్వరలో 8వ వేతన సంఘం ఏర్పాటు కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు ఈ నిబంధనతో కఠిన హెచ్చరిక జారీ చేసినట్లు అయింది.   

6 /9

పెన్షన్, గ్రాట్యూటీ నిలిపివేసే అధికారం.. సంబంధిత ఉద్యోగికి అపాయింటింగ్ అథారిటీలో ఉన్న ఉన్నతాధికారులకు ఉంటుంది. ఒక ఉద్యోగి డిపార్ట్‌మెంటల్ లేదా న్యాయ విచారణలో తప్పు చేసినట్లు రుజువు అయితే.. పెన్షన్, గ్రాట్యుటీ చెల్లింపులపై నిర్ణయం తీసుకుంటారు.   

7 /9

సెంట్రల్ సివిల్ సర్వీసెస్ పెన్షన్ రూల్స్ 2021 ప్రకారం.. కేంద్రం ప్రభుత్వం రీసెంట్‌గా కొత్త నిబంధనలతో నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఇది కేవలం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకే పరిమితం కాదని.. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ నిబంధనలపై ఆలోచన చేయవచ్చని చెబుతున్నారు.  

8 /9

ఒక వేళ ఉద్యోగి రిటైర్మెంట్ అయినా కూడా తాను సర్వీస్‌లో ఉన్నప్పుడు తప్పు చేసినట్లు తేలితే.. అతని పెన్షన్ లేదా గ్రాట్యుటీలో పూర్తిగా లేదా పాక్షిక మొత్తాన్ని వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుంది.  

9 /9

అయితే పెన్షన్‌, గ్రాట్యూటీ ఆగిపోయినా లేదా తగ్గించినా.. ఉద్యోగికి మాత్రం రూల్ 44 ప్రకారం.. నెలకు కనీసం రూ.9 వేల స్థిర మొత్తం ప్రభుత్వం నుంచి అందుతుంది. పెన్షన్‌దారుల భద్రత, హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త నిబంధనలతో ఉద్యోగులు విధుల్లో మరింత పారదర్శకంగా పనిచేస్తారని ప్రభుత్వం భావిస్తోంది. విధుల్లో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఉండదని చెబుతోంది.