Lemon Removes Dandruff: చుండ్రు సమస్య ప్రతి ఒకరినీ వేధిస్తుంది. దీంతో హెయిర్ ఫాల్ సమస్య పెరుగుతుంది. కొంత మందికి అయితే కొన్ని నెలలపాటు చుండ్రు సమస్య వేధిస్తుంది. కొంత మందిని కొన్ని నెలలపాటు ఈ చుండ్రు సమస్య వేధిస్తుంది. పెచ్చులు పెచ్చులుగా అలాగే ఉండిపోతుంది. ఇలాంటి వారికి చుండ్రుకు సరైన రెమెడీ నిమ్మకాయతో చెక్ పెట్టొచ్చు
మీరు వాడే షాంపూ కూడా మార్చకుండా కేవలం నిమ్మకాయతోనే చుండ్రును వదిలించుకోవచ్చు. దీనికి ఇంటి చిట్కాలు కొన్ని ఉపయోగించండి. దీంతో అధికంగా కెమికల్స్ ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఎక్కువ డబ్బు ఖర్చు కూడా మీ జుట్టుకు పెట్టాల్సిన అవసరం లేదు.
నిమ్మరసం తీసి పెట్టుకోవాలి. ఇందులో కలబంద జెల్ కూడా వేసుకోవాలి. వీటిని ఇంట్లో పెంచుకున్న చెట్టును తీసుకోవచ్చు. ఈ రెండిటినీ బాగా మిక్స్ చేయాలి. జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేసి బాగా ఆరనివ్వాలి. ఆ తర్వాత సాధారణ షాంపూతో తలస్నానం చేయాలి.
ఆముదం నూనెలో కూడా నిమ్మరసం వేసుకుని బాగా కలపాలి. ఈ రెండిటినీ మిక్స్ చేసి జుట్టు అంతటికీ బాగా పట్టించాలి. ఆ తర్వాత తలస్నానం చేయాలి. లేదా కొబ్బరి నూనెలో నిమ్మరసం కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించాలి.
గ్రీన్ టీలో నిమ్మరసం కలపండి. ఈ ప్యాక్‌ను కూడా జుట్టుకు వేయడం వల్ల చుండ్రు పత్తా లేకుండా పోతుంది. ఇదే విధంగా నానబెట్టిన మెంతి గింజలు, నిమ్మరసం బాగా కలిపి జుట్టుకు అప్లై చేయండి. ఈ ప్యాక్ వల్ల చుండ్రు తగ్గిపోతుంది.
జుట్టుకు ఈ నిమ్మరసం రాయడం వల్ల చుండ్రు సమస్యలు తగ్గిపోతాయి. ఆలివ్ ఆయిల్ కూడా కలుపుకోవాలి. వారానికి మూడుసార్లు ఆలీవ్ ఆయిల్, నిమ్మరసం బాగా కలిపి జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు బాగా అప్లై చేయాలి. దీంతో పెచ్చులు పెచ్చులుగా ఉన్న చుండ్రు కూడా వదిలిపోతుంది.