Mahesh Babu meets Venkatesh : వెంకటేష్ హీరోగా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. భారీ కలెక్షన్స్ సొంతం చేసుకుంటూ ఈ చిత్రం సంక్రాంతి పండగ విన్నర్ గా నిలిచింది. ఈ క్రమంలో ఈ చిత్ర యూనిట్ ని మహేష్ బాబు కలిసి ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు..
ప్రస్తుతం ఉన్న తెలుగు దర్శకుల్లో 100% స్ట్రైక్ రేట్ ఉన్నవాళ్లు చాలా తక్కువ మంది. అందులో రాజమౌళి తరువాత స్థానం అనిల్ రావిపూడికే దక్కింది. ఈ దర్శకుడు తీసిన ఎనిమిది సినిమాలో కూడా మంచి విజయం సాధించాయి.
అయితే ఈ 8 సినిమాలలో మూడు సినిమాలు వెంకటేష్ కావడం విశేషం. ఇక ఈ సంక్రాంతి సందర్భంగా మరోసారి వెంకీ మామతో వచ్చి మంచి విజయం సాధించాడు ఈ డైరెక్టర్. ఈ సంక్రాంతికి మూడు సినిమాలు విడుదల కాగా అందులో అనిల్ రావిపూడి వెంకటేష్ కాంబినేషన్లో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం భారీ విజయం సాధించింది..
ఈ క్రమంలో ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ కి హాజరయ్యారు మహేష్ బాబు. మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్లో గతంలో సరిలేరు నీకెవ్వరు సినిమా వచ్చి మంచి విజయం సాధించింది. మరోపక్క వెంకటేష్, మహేష్ బాబు కాంబినేషన్లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తెలుగు సినిమాలోని క్లాసిక్ గా నిలిచింది.
ఇక ఇప్పుడు పెద్దోడు, చిన్నోడు ఇద్దరు కలవడంతో ఆ ఫోటోలు కాస్త తెగ వైరల్ అవుతూ సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
కాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఇప్పటికే వందకోట్ల క్లబ్లో చేరిపోయింది. అయితే ఇంకా కూడా థియేటర్స్ లో చూడు తగ్గటం లేదు. ఈ సినిమా వెంకటేష్ కెరియర్ లోనే హైయెస్ట్ కలెక్షన్ సాధించిన సినిమాగా నిలుస్తుంది అని ధీమా వ్యక్తం చేస్తున్నారు సినీ విశ్లేషకులు.