Maha kumbh: ముగింపు దశలో కుంభమేళా.. సీఎం యోగి ముందు అఖిలేష్ యాదవ్ సంచలన డిమాండ్.. స్టోరీ ఏంటంటే..?

Akhilesh Yadav on Maha kumbh: మాజీ ముఖ్యమంత్రి సమాజ్ వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కుంభమేళ పుణ్యస్నానాలపై  చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. 

1 /6

ప్రయాగ్ రాజ్ కుంభమేళకు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా భక్తులు భారీగా తరిలిస్తున్నారు. చిన్న, పెద్ద అని తేడాలేకుండా.. ప్రతి ఒక్కకు కుంభమేళకు పొటెత్తారు. ప్రస్తుతం కుంభమేళలో 50 కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారని యోగి సర్కారు ప్రకటించింది.  

2 /6

దాదాపు 144 ఏళ్ల తర్వాత ఏర్పడిన కుంభమేళ కావడంతో భక్తులు కూడా భారీగా పొటెత్తారు. జన్వరి 13న ప్రారంభమైన కుంభమేళ.. ఫిబ్రవరి 26 వరకు కొనసాగనుంది. మరోవైపు చివరి పుణ్యస్నానం ఫిబ్రవరి 26న జరగనుంది. ఈరోజు మహా శివరాత్రి కూడా కావడంతో భక్తులు పొటెత్తివస్తారని యూపీ సర్కారు భావిస్తుంది.  

3 /6

మరోవైపు కుంభమేళాకు వెళ్లే ట్రైన్ లన్ని భక్తులతో కిటకిటలాడుతున్నాయి. బస్సులు, రైళ్లు, విమానులు, సొంత వాహానాల్లో చాలా మంది కుంభమేళకు వెళ్తున్నారు. దీంతో కుంభమేళకు వెళ్లే మార్గాలలో బీభత్సమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని చెప్పుకొవచ్చు.  

4 /6

ఈ క్రమంలో ప్రస్తుతం కుంభమేళ ఫిబ్రవరి 26తొ ముగుస్తుంది. దీంతో సమాజ్ వాదీ పార్టీఅధినేత అఖిలేష్ యాదవ్ దీనిపై యోగి సర్కారుకు కీలకమైన డిమాండ్ చేశారు. గతంలో కుంభమేళను 75 రోజులు కూడా నిర్వహించారని గుర్తు చేశారు. ప్రస్తుతం కూడా కుంభమేళను పొడిగించాలని యోగి సర్కారును డిమాండ్ చేశారు.   

5 /6

దీంతో భక్తులు చాలామంది ప్రయాగ్ రాజ్ కు వచ్చే విధంగా అవకాశం ఉంటుందని కూడా అఖిలేష్ యాదవ్ కోరారు. అయితే.. కుంభమేళకు వచ్చే భక్తుల సంఖ్య దాదాపుగా.. 50 కోట్లను దాటింది. ఈ సంఖ్య భారత్, చైనా మినహా.. అమెరికా, రష్యా, ఇండోనేషియా, బ్రెజిల్ , పాకిస్థాన్, బంగ్లా దేశ్ జనాభాల కంటే ఎక్కువని కూడా అధికారులు వెల్లడించారు.

6 /6

మరోవైకు కుంభమేళలకు వెళ్తున్న భక్తుల  కోసం ఇండియన్ రైల్వేస్ అనేక ప్రత్యేక రైళ్లను కూడా నడుపుతుంది. దీనిలో భాగంగా.. కుంభమేళలకు మూడు రోజుల పాటు ప్రత్యేకంగా వందే భారత్ రైళ్లను కూడా నడుపుతున్నట్లు వెల్లడించింది. దీంతో కుంభమేళకు మరింత మంది భక్తులు వెళ్లేందుకు అవకాశం ఉన్నట్లు సమాచారం.