Magnesium Rich Foods: మెగ్నీషియం లోపం అంత డేంజరా, ఈ ఫుడ్స్ తీసుకోండి

Magnesium Rich Foods: మనిషి ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన వివిధ రకాల మినరల్స్, విటమిన్లలో మెగ్నీషియం అత్యంత కీలకమైంది. మీ శరీరంలో 300 కు పైగా జీవ క్రియలకు ఇది కారణమౌతుంది. కండరాల నుంచి నాడీ వ్యవస్థ వరకూ, ఎముకల ఆరోగ్యానికి అన్నింటికీ మెగ్నీషియం. కీలకం. 

Magnesium Rich Foods: అయితే మెగ్నీషియం లోపిస్తే చాలా ప్రమాదకరం. అలసట, కండరాల్లో నొప్పి, గుండె సంబంధిత వ్యాధులు ఇలా చాలా వ్యాధులకు కారణమౌతుంది. రోజువారీ డైట్‌లో మెగ్నీషియంలో అధికంగా ఉండే ఈ పదార్ధాలు చేర్చితే ఆ లోపం తలెత్తకుండా చేయవచ్చు. 

1 /5

అరటి పండ్లు అరటి పండ్లలో పొటాషియంతో పాటు మెగ్నీషియం కూడా పెద్దఎత్తున ఉంటుంది. ఒక అరటి పండులో 32 మిల్లీగ్రాముల మెగ్నీషియం లబిస్తుంది. 

2 /5

డార్క్ చాకోలేట్స్ మెగ్నీషియం లోపం తీర్చేందుకు మరో బెస్ట్ పదార్ధం డార్క్ చాకోలేట్స్. 28 గ్రాముల డార్క్ చాకోలేట్‌లో 64 మిల్లీగ్రాముల మెగ్నీషియం ఉంటుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. 

3 /5

ఆనపకాయ గింజలు ఆనపకాయ గింజల్లో మెగ్నీషియం భారీగా ఉంటుంది. కేవలం 28 గ్రాముల ఆనపకాయ గింజలు తీసుకుంటే అందులో 150 మిల్లీగ్రాముల మెగ్నీషియం లభిస్తుంది. 

4 /5

వాల్‌నట్స్, బాదం డ్రై ప్రూట్స్‌లో వాల్‌నట్స్, బాదంలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. 28 గ్రాముల బాదంలో 80 మిల్లీగ్రాములు మెగ్నీషియం ఉంటుంది. గుండె ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. 

5 /5

పాలకూర పాలకూరలో మెగ్నీషియం పెద్దఎత్తున ఉంటుంది. 100 గ్రాముల పాలకూరలో 79 మిల్లీగ్రాముల మెగ్నీషియం ఉంటుంది. పాలకూరను రోటీతో లేదా అన్నంతో తీసుకోవచ్చు. ఇందులో మెగ్నీషియంతో పాటు ఐరన్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి.