Hyderabad: మందు బాబులకు బిగ్ షాక్‌.. ఈ నెలలో 2 రోజులు వైన్‌షాపులు బంద్..

Liquor Shops Closed For 2 Days: ఆదివారం లేదా ఏ పార్టీలు, ఫంక్షన్లు చేసుకోవాలన్నా చాలా మందికి ముక్కా సుక్కా ఉండాల్సిందే. అయితే, ఈ నెలలో రెండు రోజులు వైన్‌ షాపులు బంద్‌ ఉండనున్నాయి. ఇది మందుబాబులకు కాస్త ఛేదు వార్త. అయితే, ఎప్పుడు వైన్స్‌, బార్లు మూతపడనున్నాయి తెలుసా?
 

1 /5

ఈనెలలో రెండు రోజులపాటు వైన్స్‌ బంద్‌ ఉంటాయి. ముఖ్యంగా ఆర్‌సీ పురం, కొల్లూరు పరిధిలోని అన్నీ వైన్‌ షాపులు, బార్, రెస్టారెంట్‌లతోపాటు కల్లు దుకాణాలు కూడా బంద్‌ ఉండనున్నాయి.  

2 /5

సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అవినాష్‌ మొహంతీ ఈ మేరకు ఆదేశాలను జారీ చేశారు. తెలంగాణ ఎమ్మెల్సీ (MLC) ఎన్నికల నేపథ్యంలో రెండు రోజులపాటు మద్యం విక్రయాలు నిలిపివేయాలని ఆదేశించారు.  

3 /5

ఈనేపథ్యంలో 1951 యాక్ట్‌ సెక్షన్‌ 135-C ప్రకారం ఆర్‌సీ పురం, కొల్లూరు పరిధిలో ఈనెల 25వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు మద్యం విక్రయాలు బంద్‌ ఉంటాయి.  

4 /5

ఇది కేవలం వైన్‌ షాపులకు మాత్రమే పరిమితం కాలేదు. అన్నీ బార్లు, రెస్టారెంట్లు, స్టార్‌ హోటళ్లలో విక్రయాలు కూడా బంద్‌ ఉంటాయి. నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని పోలీసు అధికారులు ఆదేశించారు.  

5 /5

మెదక్‌- నిజామాబాద్‌-ఆదిలాబాద్‌- కరీంనగర్‌ నియోజనకవర్గాల్లో గ్రాడ్యూయేట్‌, టీచర్‌ బై ఎలక్షన్స్‌ ఫిబ్రవరి 27వ తేదీ నిర్వహిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో శాంతిభద్రతల నేపథ్యంలో ఈ ఆర్డర్‌ జారీ చేశారు.