Sathi Leelavathi: ఫ్లాపులతో భర్త.. పెళ్లి తర్వాత ‘సతీ లీలావతి’తో బిజీగా లావణ్య త్రిపాఠి

Lavanya Tripathi Sathi Leelavathi Movie Latest Updates: పెళ్లి చేసుకున్న తర్వాత తన తొలి సినిమాను వరుణ్‌ తేజ్‌ భార్య లావణ్య త్రిపాఠి సినిమ చేస్తోంది. తన సినిమా పూర్తి చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. హీరోయిన్‌ ఓరియెంటెండ్‌ సినిమాలో తొలిసారి నటిస్తున్న లావణ్య ఈ చిత్రంపై భారీ ఆశలు పెట్టుకుంది. మరి ఆ సినిమా వివరాలు తెలుసుకుందాం.

1 /6

గతేడాది మెగా నటుడు కొణిదెల వరుణ్‌ తేజ్‌ను హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వివాహం తర్వాత కొన్నాళ్లు సినిమాలకు దూరమైన లావణ్య ఇప్పుడు మళ్లీ కెరీర్‌పై దృష్టి సారించింది.

2 /6

పెళ్లి తర్వాత హీరోయిన్‌ ఓరియెంటెండ్‌ సినిమాలో నటిస్తోంది. తాతినేని స‌త్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పేరు ‘సతీ లీలావతి’. వైవిధ్య‌మైన పాత్రల‌తో క‌థానాయిక‌గా త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు సంపాదించుకున్న లావ‌ణ్య త్రిపాఠి తొలిసారి భిన్నమైన కథాంశంతో ఈ చిత్రంలో నటిస్తోంది.

3 /6

లావణ్యకు జోడీగా మ‌ల‌యాళ న‌టుడు దేవ్ మోహన్‌ నటిస్తుండగా.. ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చ‌ర్స్‌, ట్రియో స్టూడియోస్ ప‌తాకాల‌ సంయుక్త నిర్మాణం ఈ సినిమా నిర్మాణమవుతోంది. 

4 /6

భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్‌ఎంఎస్‌ (శివ మ‌న‌సులో శృతి) సినిమాలు తీసిన తాతినేని స‌త్య దర్శకత్వం వహిస్తుండగా.. ఈ సినిమాను ఎం నాగమోహ‌న్ బాబు, టీ రాజేష్‌ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చకచకా షూటింగ్‌ పూర్తి చేసుకుంటోంది. 

5 /6

శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసుకుంటున్న సతీ లీలావతి ఫస్ట్ షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. హైదరాబాద్‌లోనే జరిగిన ఈ షెడ్యూల్‌లో  హీరో హీరోయిన్ల మీద కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. 

6 /6

వెంటవెంటనే షూటింగ్ పూర్తి చేసి వేసవి కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది. ఫీల్ గుడ్ మూవీగా అందరినీ ఆకట్టుకునేలా.. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించేలా ఈ చిత్రం తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తుండగా.. కెమెరామెన్‌గా బినేంద్ర మీనన్, ఎడిటర్‌గా సతీష్ సూర్య వ్యవహరిస్తున్నారు.