Devara Karnataka Box Office Closing Collections: ఆర్ఆర్ఆర్ వంటి ప్యాన్ ఇండియా మూవీతో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ గ్లోబల్ లెవల్లో పెరగింది. ఈ సినిమా తర్వాత తారక్ హీరోగా యాక్ట్ చేసిన చిత్రం ‘దేవర’. ఈ సినిమా విడుదలైన 5వ వారాలు పూర్తి చేసుకుంది. ఇప్పటికే తెలుగు మినహా అన్ని ఏరియాల్లో ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసింది.
ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర’ సినిమా అన్ని ఏరియాల్లో థియేట్రికల్ గా రన్ క్లోజ్ అయింది. తమిళనాడు, కేరళ, కర్ణాటక, హిందీలో ఈ సినిమా థియేట్రికల్ గా రన్ ముగిసింది.
‘అరవింద సమేత వీరరాఘవ’ చిత్రం తర్వాత ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన చిత్రం ‘దేవర’. కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ చిత్రం దాదాపు రూ.500 కోట్ల క్లబ్బులో ప్రవేశించింది.
‘దేవర’ కర్ణాటకలో కూడా మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమా అక్కడ రూ. 16 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అక్కడ ఈ సినిమా అక్కడ దాదాపు రూ. 40 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.
మొత్తంగా ‘దేవర’ మూవీ అక్కడ రూ.19 కోట్ల షేర్ రాబట్టింది. మొత్తంగా రూ. 16 కోట్లకు గాను రూ. 19 కోట్ల కలెక్షన్స్ రాబట్టి దాదాపు రూ. 3 కోట్ల లాభాలను తీసుకొచ్చింది.
ఇక ఈ సినిమా కేరళలో రూ. 1 కోటి ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తే.. రూ. 1.25 కోట్ల కలెక్షన్స్ రాబట్టి అక్కడ కూడా మంచి వసూళ్లను రాబట్టింది. ఓవర్సీస్ లో 6 మిలియన్ యూఎస్ డాలర్స్ కలెక్ట్ చేసింది.
ఇక తెలంగాణలో కూడా ఈ సినిమా రికార్డు బ్రేక్ వసూళ్లను రాబట్టింది. మొత్తంగా ఇక్కడ రూ. 64 కోట్ల షేర్ (రూ. 125 కోట్ల గ్రాస్)వసూల్లతో సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. ఓవరాల్ గా తెలుగులో రూ. 175 కోట్ల షేర్ (రూ. 285 కోట్ల గ్రాస్)వసూళ్లను రాబట్టడం విశేషం.
దాదాపు అన్ని ఏరియాల్లో థియేట్రికల్ బిజినెస్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 9 నుంచి ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో 5 భాషల్లో స్ట్రీమింగ్ కు కరానుంది. అంతేకాదు ‘దేవర’తో రాజమౌళి సెంటిమెంట్ కు బ్రేకులు వేసాడు.
ఎన్టీఆర్ విషయానికొస్తే.. దేవర తర్వాత ‘దేవర పార్ట్ 2’ సినిమా చేస్తున్నాడు. దీంతో పాటు ‘వార్ 2’, ప్రశాంత్ నీల్ తో చేస్తోన్న ‘డ్రాగన్’ మూవీలు లైన్ లో ఉన్నాయి.