Hair Fall Remedies: జుట్టు రాలుతోందా, పొడిబారుతోందా, ఈ పూల ఆయిల్ రాయండి

ఈ మధ్యకాలంలో నిర్ణీత వయస్సు కంటే ముందే జుట్టు రాలడం, తెల్లబడటం వంటి సమస్యలు అధికంగా ఉంటున్నాయి. ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు చాలామంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా సరైన ఫలితాలు పొందలేకుంటారు. అయితే ఔషధ గుణాలు కలిగిన 5 పూలు ఇందుకు అద్భుతంగా పనిచేస్తాయి. జుట్టు ఎదగడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది.

Hair Fall Remedies: ఈ మధ్యకాలంలో నిర్ణీత వయస్సు కంటే ముందే జుట్టు రాలడం, తెల్లబడటం వంటి సమస్యలు అధికంగా ఉంటున్నాయి. ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు చాలామంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా సరైన ఫలితాలు పొందలేకుంటారు. అయితే ఔషధ గుణాలు కలిగిన 5 పూలు ఇందుకు అద్భుతంగా పనిచేస్తాయి. జుట్టు ఎదగడానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది.
 

1 /6

పూలలో ఔషధ గుణాలు ఆయుర్వేద గుణాల ప్రకారం పూలలో అన్ని రకాల ఔషధ గుణాలు ఎక్కువ. ఇందులో ఎమైనా యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఫలితంగా రక్త సరఫరా మెరుగుపడుతుంది. కేశాలకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

2 /6

మందార పూలు మందారపూలలో ఎమైనో యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కేశాలు రాలడాన్ని నియంత్రిస్తాయి. మందారపూల రేకుల్ని ఒక స్పూన్ కొబ్బరి నూనె, ఒక చెంచా పెరుగుతో కలిపి అప్లై చేయాలి. కేశాలకు రాసి 30 నిమిషాలుంచాలి.  ఆ తరువాత గోరువెచ్చని నీటిలో కడగాలి

3 /6

గులాబీ గులాబి పూలలో యాంటీ సెప్టిక్ గుణాలు అధికంగా ఉంటాయి. వీటి వల్ల స్కాల్ప్ పటిష్టంగా మారుతుంది. రోజ్ వాటర్ నీళ్లలో ఉడికించి గరగర చేయాలి. దాంతోపాటు రోజ్ వాటర్‌తో కండీషనర్ చేయాలి. ఇలా చేయడం వల్ల కేశాలు రాలడం తగ్గుతుంది

4 /6

మల్లెపూలు గింగురు జుట్టు లేదా డ్రై జుట్టు ఉండేవారికి మల్లెపూల ఆయిల్ చాలా మంచిది. ఈ ఆయిల్ వాడటం వల్ల కేశాలు కుదుళ్లతో సహా పటిష్టంగా ఉంటాయి. పోషకాలు అద్భుతంగా అందుతాయి. జాస్మిన్ ఆయిల్‌లో విటమిన్ ఇ కలిపి జుట్టుకు రాసి 30 నిమిషాలు ఉంచాలి. ఆ తరువాత తేలికపాటి షాంపూతో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే జుట్టు డ్రైనెస్ పోతుంది

5 /6

కమలం పూలు కమలం పూలు కూడా కేశాల ఆరోగ్యానికి చాలా ఉపయోగం. కమలం పూల ఆయిల్ తీసి కొబ్బరి నూనెతో కలిపి రాయాలి. ఓ అరగంట ఉంచి తేలికపాటి షాంపూతో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల డ్రైనెస్ పోతుంది. కేశాలు బలంగా ఉంటాయి. జుట్టుకు నిగారింపు వస్తుంది.

6 /6

బంతి పూలు బంతి పూలు కేశాల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలుంటాయి. ఇవి స్కాల్ప్ స్వెల్లింగ్ సమస్యను దూరం చేస్తాయి. కొబ్బరి నూనెలో బంతి పూల రేకులు కలిపి రాసి 30-40 నిమిషాలు ఉంచాలి. ఆ తరువాత గోరు వెచ్చని నీటితో కడగాలి