IPL Records: ఐపీఎల్‌లో ఆరెంజ్ క్యాప్ గెలవని స్టార్ ప్లేయర్లు.. లిస్టులో ఎవరున్నారంటే..?

Who Never Won Orange Cap: ఐపీఎల్‌లో ఇప్పటివరకు 16 సీజన్లు జరిగాయి. ఐపీఎల్ ద్వారా ఎందరో బ్యాట్స్‌మెన్లు వెలుగులోకి వచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా.. ఐపీఎల్‌లోనూ మెరుపులు మెరిపించిన కొందరు స్టార్ ప్లేయర్లు మాత్రం ఆరెంజ్ క్యాప్‌ గెలుచుకోలేకపోయారు. ఆ లిస్టులో ఎవరున్నారో ఓ లుక్కేయండి..
 

1 /5

చెన్నై సూపర్ కింగ్స్ చిన్న తల, మిస్టర్ ఐపీఎల్‌గా పేరు పొందిన సురేష్ రైనా ఒక్కసారి కూడా ఆరెంజ్‌ క్యాప్ గెలుచుకోలేదు. రైనా చాలా సంవత్సరాలు సీఎస్‌కే బ్యాటింగ్‌కు వెన్నముకగా నిలిచిన విషయం తెలిసిందే.   

2 /5

ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ ప్లేయర్లలో ఏబీ డివిలియర్స్ ఒకడు. ఆర్‌సీబీ జట్టు తరుఫున అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడిన ఈ మిస్టర్ 360.. ఐపీఎల్‌లో ఆరెంజ్ క్యాప్ మాత్రం గెలవలేదు. 184 మ్యాచ్‌లలో.. 3 సెంచరీల సాయంతో 5162 పరుగులు చేశాడు డివిలియర్స్.

3 /5

కోల్‌కతా నైట్ రైడర్స్‌కు రెండు ఐపీఎల్ టైటిల్‌లను అందించాడు గౌతం గంభీర్. ఢిల్లీ డేర్ డేవిల్స్, కేకేఆర్‌కు జట్టుకు ఓపెనర్‌గా ఎన్నో సూపర్ ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఐపీఎల్‌లో 4218 పరుగులు చేసినా.. లీగ్ చరిత్రలో ఎప్పుడూ ఆరెంజ్ క్యాప్ గెలవలేదు.   

4 /5

ముంబై ఇండియన్స్ టీమ్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఐదు టైటిళ్లు గెలిచినా.. ఆరెంజ్ క్యాప్ మాత్రం విన్ అవ్వలేదు. బ్యాట్స్‌మెన్‌గా ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడిన హిట్‌మ్యాన్.. ఆరెంజ్ క్యాప్ రేసులో మాత్రం నిలవలేదు.   

5 /5

పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ కూడా ఐపీఎల్‌లో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. అయితే ఈ డాషింగ్ ఓపెనర్‌కు ఎప్పుడూ ఆరెంజ్ క్యాప్ గెలుచుకోలేదు.